సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర నవంబర్ 1న ప్రారంభమైంది. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ ప్రారంభించిన ఈ మహాపాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలకు చేరుకోనుంది. అయితే నేడు 27వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది.
ఈ రోజు నెల్లూరు జిల్లాలో 12 కిలోమీటర్ల మేర కొనసాగనున్న రైతుల పాదయాత్ర అంబాపురం వద్ద ముగియనున్నట్లు అమరావతి రైతుల జేఏసీ వెల్లడించింది. ఏపీలో భారీ వర్షాలు కురుస్తునప్పటికీ రాజధాని రైతులు పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాజధాని రైతుల పాదయాత్రకు ఊరురా రైతులు, ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నేతలు పాదయాత్ర చేసేది రైతులు కాదు.. టీడీపీ నేతల బినామీలు అంటూ ఆరోపణలు చేస్తున్నారు.