కొండపల్లి చైర్మన్ ఎన్ని వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా విధ్వంసం సృష్టించి వాయిదా వేయించడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు. ఎన్నిక నిర్వహణ రాకపోతే ఎస్‌ఈసీ, డీజీపీలు తప్పుకోవాలని ధ్వజమెత్తారు. ఎన్నిక అడ్డుకోవడమెందుకు.. వైకాపా వారినే చైర్మన్ చేయండి అంటూ మండి పడ్డారు. టీడీపీ సభ్యులను లోబర్చకోని కొండపల్లిలో పాగా వేయాలని చూస్తున్నారన్నారు. కౌన్సిల్ కార్యాలయంలోకి సంబంధం లేని…
ఇటీవలే ఏపీలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీల ఎన్నికల జరిగిన విషయం తెలిసింది. అయితే కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో 29 స్థానాలు ఉండగా 14 స్థానాల్లో వైసీపీ 15 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే 16 సభ్యుల కోరం ఉంటేనే చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ కార్యాలయం వద్దకు నిన్న టీడీపీ, వైసీపీ శ్రేణులు చేరుకున్నారు.…
మొన్నటి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏపీని కుదిపేశాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చెరువులకు గండిపడిపోవడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నెల్లూరు జిల్లాలోని సోమశిల డ్యామ్ తెగిపోతుందని ఆకతాయిలు వదంతులు సృష్టించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా కొందరు గ్రామాలను వదిలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు అలర్ట్ అయిన అధికారులు సొమశిల డ్యామ్ సురక్షితంగా ఉందని వదంతులు నమ్మి…
ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే మండలి సమావేశాలు ప్రారంభంలోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండలి ముందుకు 3 రాజధానుల చట్ట ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు రద్దుపై మండలిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుగ్గన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని భావించామన్నారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనే పెట్టారని అన్నారు. మిగితా రాష్ట్రాలు బీహెచ్‌ఈఎల్, బీడీఎల్ వంటి సెక్టార్లను…
మామూలుగా అఘోరా అంటేనే ఆశ్చర్యం, ఒక్కింత భయం కలగడం సహజం. దానికి కారణం అఘోరాల విధివిధానాలే. అఘోరాల్లో కొందరు నగ్నంగా, చిన్న గుడ్డకట్టుకొని కనిపించడమే కాకుండా వారి రూపం కూడా భయాందోళనకు గురి చేస్తుంటుంది. అంతేకాకుండా ఈ అఘోరాలు కాలిన బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్లంతా రాసుకోవడం, మానవ మృతదేహాలను తినడం లాంటి విపరీత చర్యలు చూసి ఒక్కింత భయం కలుగుతుంది. అయితే తాజాగా ఓ అఘోరా తన శిష్యురాలిగా ఉన్న అఘోరీని పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడుకు…
ఏపీలో సంచలన సృష్టించిన 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా త్వరలోనే కొన్ని మార్పులతో మరోసారి బిల్లును తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇది ఇంటర్వెల్ మాత్రమే ఇంకా 3 రాజధానుల సినిమా అయిపోలేదు అన్నారు. అయితే తాజాగా తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా 3 రాజధానుల అంశంపై స్పందించారు. సీఎం జగన్ తగ్గేదేలేదని..…
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్ల తెలుస్తోంది. ఏపీ శాసన మండలి రద్దు చేస్తున్నట్లు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనుంది. గతంలో సంవత్సరం జనవరిలో శాసన మండలిని రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ తీర్మానానికి 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ హజరుకాకపోవడంతో ఈ తీర్మానంపై వ్యతిరేకంగా ఓట్లు రాలేదు. దీంతో ఆ రోజు…
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టిన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు జరుగనుంది. అయితే నేడు 23వ రోజు నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు అమరావతి రైతుల జేఏసీ నాయకులు తెలిపారు. కొండబిట్రగుంట నుంచి ప్రారంభమయ్యే సున్నంబట్టి వరకు 15 కిలోమీటర్లు సాగనుంది. అయితే నవంబర్ 1న ప్రారంభమైన ఈ పాదయాత్ర డిసెంబర్ 15వ తిరుమలకు చేరుకుంటుంది. ఇదిలా ఉంటే..…
తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కేసీఆర్ కూతురు కవితను మరోసారి ఎమ్మెల్సీగా ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత పదవీకాలం జనవరి 4న ముగియనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆ రాజ్యసభ ఆ స్థానంలో రాజ్యసభకు కవితను వెళ్లబోతుందంటూ ప్రచారం…
ధాన్యం కొనుగోలు విషయమై నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడో రోజు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని ప్రకటించడంతో సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారుల బృందంతో ఢిల్లీకి వెళ్లారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ప్రకారం నేటితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికీ టీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు కూడా వారివారి నామినేషన్లను సమర్పించారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో…