భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికీ భారీ వర్షాలతో వాగుల, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువు కట్టలు తెగిపోవడంతో కింద ఉన్న గ్రామాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. అయితే తాజాగా రాయల్ చెరువు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాయల చెరువుకు ఇప్పటికే గండి పడడంతో అధికార యంత్రాంగం దానిని పూడ్చేపనిలో నిమగ్నమైంది. ఇప్పుడు కింది గ్రామాలు ఉలిక్కిపడేలా రాయల చెరువుకు మరో 3 చోట్ల నుంచి నీరు లీకవుతోంది.
Also Read : చెయ్యేరు బీభత్సం.. ఇంకా కానరాని 12 మంది ఆచూకీ..
వరద నీరు రాయల చెరువుకు కొనసాగుతుండడంతో ఎక్కువగానే నీటిని వదులుతున్నారు. అయినప్పటికీ చెరువుకు లీకుల బెడద తప్పడం లేదు. అయితే ఊట నీరుతోనే చెరువుకు వరసగా లీకేజీలు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కింది గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏ విధంగా జలప్రళయం సంభవిస్తుందోనని భయాందోళనలో ఉన్నారు. అధికారులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదంటూ వెల్లడిస్తున్నారు.