తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రెగ్యులర్ టెస్ట్‌లతో పాటు చేసిన టెస్టుల్లో కోవిడ్ సోకినట్లు తెలిసింది. ఈ క్రమంలో కోవిడ్ సోకినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పోచారం వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గత కొన్ని రోజుల తనతో సన్నిహితంగా మెదిలిన వ్యక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇటీవల పోచారం శ్రీనివాస్ మనవరాలి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలుగు…
టాలీవుడ్ సింగర్ హరిణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వారం రోజులుగా సింగర్ హరిణి కుటుంబం కనిపించకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపుతున్న వేళ.. అందరూ షాక్ తినేలా హరిణి తండ్రి ఏకేరావు బెంగూళూరు సమీపంలోని ఓ రైల్వే మృత దేహం లభ్యమైంది. ఏకే రావు సుజన్ ఫౌండేషన్‌లో సీఈవోగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు కనిపించకుండా పోయిన కుటుంబ సభ్యులు ఇప్పడు బెంగుళూరు రైల్వే పోలీస్ స్టేషన్‌లో కనిపించారు. అయితే గత వారం రోజులుగా…
హైదరాబాద్ కు చెందిన యువతి శ్రీశైలంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అభిలాష్‌రెడ్డి, మౌనిక భార్యభర్తలు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. అయితే వివాహం జరిగినప్పటి నుంచి భర్త అభిలాష్‌రెడ్డి భార్య మౌనికను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు. దీంతో విసుగుచెందిన మౌనిక భర్త అభిలాష్‌పై రెండు నెలల క్రితం సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ మహిళ పోలీస్…
గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మేఘాలయ కాంగ్రెస్‌లో చీలికలు మొదలయ్యాయి. మేఘాలయలో మొత్తం 60 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు 21 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మా తన అనచరులు 12 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా టీఎంసీ పార్టీలో చేరుతున్నట్లు స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఆయన…
అహ్మదాబాద్‌లో జరిగిన రిసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ) వార్షిక సమావేశంలో హైదరాబాద్‌కు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ సీహెచ్ వసంత్ కుమార్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ సొసైటీ ప్రజలకు మధుమేహంపై అవగాహన కల్పించడమే కాకుండా పరిశోధనలు నిర్వహిస్తుంటుంది. ఈ సోసైటీలో వివిధ దేశాల నుంచి 9,400 మంది సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా డా.వసంత్ కుమార్ మాట్లాడుతూ.. “భారతదేశం అంతటా మరిన్ని పరిశోధనలు, ప్రజలకు అవగాహన కల్పించే…
చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ.. నిన్న విశాఖపట్నంలోని నర్సీపట్నం టీడీపీ నేత అయ్యపాత్రుడు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నా కాస్తా పోలీసుల ఎంట్రీతో రసభాసగా సాగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, చింతలపూడి విజయ్ సహా 16 మందిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.…
నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. కాన్పూర్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రులతో నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. ఢిల్లోని సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతల కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు బీసీ, ఎస్సీ,…
విధి వక్రీకరించడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సీఐ అనంతలోకాలకు పయనమయ్యాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పట్టణంలోని త్రీటౌన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరరావు విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి బయలు దేరారు. అయితే ఎండాడ వద్ద గల జాతీయ రహదారిపై 3.40 గంటలకు గుర్తుతెలియని వాహనం వచ్చి సీఐ ఉన్న పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐతో పాటు ఉన్న కానిస్టేబుల్ సంతోష్ కు…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ రోజు జీహెచ్ఎంసీ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు. మేయర్ ఛాంబర్లోకి ఒక్కసారి దూసుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మేయర్ ఛాంబర్ రణరంగంగా మారింది. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్పొరేటర్లను మేయర్ ఛాంబర్ నుంచి బయటకు పంపించారు. అంతేకాకుండా మేయర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లను అతికించారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా ఎలాంటి…