యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీ విడుదల సమయం దగ్గర పడుతోంది. మరో నెల మాత్రమే ఈ సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. తాజాగా సెన్సార్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. మరోవైపు ‘RRR’ మూవీ రన్‌టైమ్ మీదా గాసిప్స్ వస్తున్నాయి.
Read Also: ఎన్టీఆర్ షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?
ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా రెండున్నర గంటలకు మించి ఉండటం లేదు. అయితే ‘RRR’ మూవీ రన్‌టైం మాత్రం ఎక్కువ అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మూవీ టోటల్ రన్‌టైమ్ మూడు గంటల 6 నిమిషాలు అని తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం సినిమా యూనిట్ వెల్లడించలేదు. ఈ వార్త నిజమైతే మాత్రం ఈ సినిమా ఒక్కో షోకు థియేటర్ యాజమాన్యం మూడు గంటల 15నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది. తద్వారా రెగ్యులర్ షో టైమింగ్స్ మారే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్.. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలలో కనిపించనున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు.
#RRRMovie Update
— Trendswood (@Trendswoodcom) November 26, 2021
Censored: UA
Runtime: 3 Hours 6 Minutes
Release Date : 7th January 2022 pic.twitter.com/0PmK7u6h4W