హెచ్‌ఎండీఏకు ఊహించని రీతిలో కాసుల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పల్ భగాయత్ మూడో దశ వేలంలోనూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలతో పోటీ పడుతూ ఉప్పల్‌లోనూ రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01లక్షల చొప్పున ధర పలకడం గమనార్హం. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీఎస్ వేదికగా జరిగిన ఈ ప్రక్రియలో ఉప్పల్ ప్రాంతానికి భవిష్యత్తు ఉందనే నమ్మకంతో ప్రవాసీయులతోపాటు స్థానిక రియల్టర్లు నువ్వా నేనా అన్నట్టుగా ధరలు పెంచుకుంటూ పోయారు.
చదరపు గజానికి రూ.35వేలు నిర్ధారిత ధర ఉండగా.. ఉదయం సెషన్లో ఓ ప్లాటుకు అత్యధికంగా చదరపు గజానికి రూ.77వేలు, రెండో సెషన్‌లో రెండు ప్లాట్లు ఏకంగా రూ.1.01లక్షల రికార్డు ధరలు పలికాయి. కేవలం 19వేల చదరపు గజాలకే రూ.141.61 కోట్లు తొలి రోజు రాగా, శుక్రవారం మిగిలిన 1.15లక్షల చదరపు గజాల్లో మొత్తం 21 ప్లాట్లకు సగటున రూ.60వేలు వరకు వచ్చినా సుమారు రూ.900 కోట్లు ఖజానాకు వస్తాయని హెచ్‌ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
- CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
భారీ అంచనాలు..
మల్టీ పర్పస్ జోన్‌కి కేటాయించిన 12.04 ఎకరాల్లో 10 ప్లాట్లతో పాటు మరో 11 ప్లాట్లను శుక్రవారం వేలం వేయనున్నారు. తొలిరోజు ప్రవాసీయులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడంతో రెండో రోజు మల్టీపర్పస్ భూములకు చదరపు గజానికి కనీసం రూ.70వేల దాకా పలికే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఉప్పల్ భూ విక్రయాల్లో రికార్డు సృష్టించనుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?