ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కె.రోశయ్య ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. రోశయ్య మృతిపట్ల రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోశయ్య కుమారుడికి ఏపీ సీఎం జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాకుండా రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమని, ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని సీఎం జగన్ పేర్కొన్నారు. రోశయ్య మృతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఇవాళ్టి నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.