రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి పారుదల అధికారులతో సమీక్ష నిర్వహించామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక బడ్జెట్‌లో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చిందన్నారు. 10,820 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేటాయించిందని, ఎక్కడ పనులు అగాయో.. ఎవరికి పెమేంట్ ఇవ్వాలి అనేది సమీక్షలో చర్చ జరిగిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాన కాలంలో కొన్ని చోట్ల వరద వచ్చే అవకాశం ఉందని, నీటిపారుదల సంబంధించి…
బడ్జెట్ లో ఎక్కువగా గత ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండలిలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చట్టబద్దత కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ పదే పదే చెప్పారని, చట్టబద్దత అనే హామీ ఊసే మర్చిపోయారన్నారు దేశపతి శ్రీనివాస్. అభయహస్తం హామీలు 13 ఉన్నాయి బడ్జెట్ లో వీటికి చోటేది..? అని ఆయన ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.2,500 ఉంది ఇస్తామన్నారు దానిగురించి ప్రతిపాదనే…
మేడిగడ్డ బారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అన్నారు. ఇవాళ ఆయన బీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుందని, ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. మున్ముందు బారేజ్ కు ఏమీ జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందని, ఒకరిద్దరు మంత్రులకు…
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినాని హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఎన్నికల అనంతరం మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం మరో మూడు రోజులు వరద ప్రవాహం కొనసాగి ఆతర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు.
వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న మైనర్ బాలిక చదువు కొనసాగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడంతో పాటు, ఆమెకు ఆసక్తి ఉంటే హాస్టల్‌లో చేరేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. సంజయ్ కుమార్ శనివారం చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో ఓ కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన భోజనం చేస్తున్న వ్యవసాయ కూలీలను చూసి ఆగిపోయాడు. సంజయ్ కుమార్ వారితో మాట్లాడుతున్నప్పుడు, వారిలో ఒక…
తిరుపతి జిల్లా వెంకటగిరిలో యువతులను, వృద్ధులను వేధిస్తున్న ఆకతాయిలని అదుపు చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు తిరుపతి పోలీసులు తక్షణం స్పందించారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి అక్కడి ప్రజలతో పోలీసులు మాట్లాడారు. ఆకతాయిల వివరాలు నమోదు చేసుకున్నారు.
అక్బరుద్దీన్ ఆరోపణలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియోగించారని అమిత్ షా, కిషన్ రెడ్డి పై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్ అని ఆయన వెల్లడించారు. ఎవరు ఔనన్నా కాదన్నా మోదీ దేశానికి ప్రధానమంత్రి… ఆయన రాష్ట్రాలన్నింటికి పెద్దన్నలాంటి వారు అని, గుజరాత్, బీహార్ లా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆయన్ను కోరామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి…
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది.చింతూరు వద్ద 40 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి - గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.