Chevireddy Mohith Reddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్
- చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హత్యాయత్నం కేసు
- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chevireddy Mohith Reddy: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినాని హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఎన్నికల అనంతరం మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులైన గణపతిరెడ్డి, భానుకుమార్‌రెడ్డి మరికొందరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ముందస్తు ప్రణాళికతో రాడ్లు, సుత్తి, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు.
Read Also: Godavari: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. 3 రోజుల పాటు కొనసాగనున్న వరద ప్రవాహం
Also Read
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
పులిపర్తి నానిపై హత్యాయత్నం ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నాని ఫిర్యాదు మేరకు అప్పటికప్పుడు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని జైలుకు పంపారు.ఇటీవల ఈకేసులో 37వ నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు. ఈ కేసులో అరెస్టు తప్పదని భావించిన మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును సైతం ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ స్వీకరించి విచారణ వాయిదా వేసింది.ఈ నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని బెంగుళూరులో పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో అరెస్ట్ అయిన మోహిత్ రెడ్డిని తిరుపతికి తరలిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!