*ఢిల్లీ: ప్రధాని మన్ కీ బాత్.. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధాని మన్ కీ బాత్.
*పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ.
*నాగర్ కర్నూల్: నేడు కల్వకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణకు హాజరు కానున్న సీఎం
*తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,173 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 32,519 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.5 కోట్లు
*అంబేడ్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో పర్యటించనున్న మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్న మంత్రులు
*కాకినాడ: నేడు రెండో రోజు పిఠాపురంలో పర్యటించనున్న పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కృష్ణ చైతన్య.. జిల్లాస్థాయి అధికారులతో ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం.. నియోజకవర్గంలో జరుగుతున్న పనులు, పెండింగ్ ప్రాజెక్టులు , అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష.. పిఠాపురం అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లనున్న కృష్ణచైతన్య.
*శ్రీ సత్యసాయి : ధర్మవరంలో పర్యటించనున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్.. పలు అభివృద్ధి కార్యక్రమాలు, చేనేత కార్మికులతో సమావేశం కానున్న మంత్రి.
*ఏలూరు: పోలవరం ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి.. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 33.810 మీటర్ల నీటిమట్టం.. ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 12,60,627 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల.
*అంబేడ్కర్ కోనసీమ: లంక గ్రామాలకు భారీగా చేరుతున్న వరద నీరు.. గత వారం రోజులు నుంచి జలదిగ్బంధంలో ఉన్న 40 లంక గ్రామాలు.. గోదావరి పోటెత్తడంతో పడవలపైనే ప్రయాణం.. బయటకు అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్న ముమ్మిడివరం మండలంలోని గురజాపులంక,కూనా లంక, లంక ఆఫ్ ఠాణే లంక, చింతపల్లి లంక గ్రామాల ప్రజలు.. 16,182 కుటుంబాలపై వరద ప్రభావం, ముంపులో ఉన్న దాదాపు 3,500 ఇళ్లు.. వేల ఎకరాల్లో నీట మునిగిన ఉద్యాన పంటలు, వరి.
*తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద క్రమేపి పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. ప్రస్తుతం 14.90 అడుగులు వద్ద నిలకడగా కొనసాగుతున్న గోదావరి వరద నీటిమట్టం.. బ్యారేజ్ నుండి 14 లక్షల 59 వేల 811 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల.. బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం.
*భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి.. తెల్లవారుజామున 4 గంటల వరకు 53. 60 అడుగులకు చేరిన నీటిమట్టం.. ఉదయం 5 గంటలకు 53. 50 అడుగులకు తగ్గిన నీటిమట్టం.. భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
*నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 24 వేల క్యూసెక్కులు.. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1074 అడుగులు.. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32 టీఎంసీలు.
*ఉమెన్స్ ఆసియా కప్ ఫైనల్ 2024: నేడు మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరు.. తలపడనున్న భారత్, శ్రీలంక జట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం.