ఈరోజు లక్షన్నర రుణ మాఫీ చేయడం శుభ పరిణామమని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తొందర్లోనే మిగతా వారికి కూడా రుణ మాఫీ చేయాలన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం కళ్ళాల వద్దే కొనాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా దరిద్రంగా తయారైందని, ధరణి వల్ల భూముల్లో గందరగోళం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అందులో మార్పులు చేయాలంటే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాలని,…
లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా…
2014-15లో ఛత్తీస్‌గఢ్‌తో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం జస్టిస్ మదన్ భీమ్‌రావ్ లోకూర్‌ను కొత్త విచారణ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలను పరిశీలించే ఏకవ్యక్తి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ (సిఓఐ)గా రిటైర్డ్ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్. నరసింహా రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు జూలై…
నేడు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా అంటే జేఆర్‌డీ టాటా జయంతి. అతను 29 జూలై 1904న జన్మించాడు. జేఆర్‌డీ టాటా దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్‌కు సుమారు 53 సంవత్సరాల పాటు ఛైర్మన్‌గా ఉన్నారు.
Rythu Runa Mafi: రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
భారతదేశం-మాల్దీవుల మధ్య సంబంధాలలో హెచ్చు తగ్గుల నేపథ్యంలో.. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైసల్ నేటి నుంచి భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ సమయంలో.. అతను భారతీయ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు.
Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. అయితే దిగువన శబరి నది వేగంగా వస్తుండడం తో స్వల్పంగా తగ్గుతుంది. ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరదతో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరద తో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది .ఈ నేపథ్యంలో గత వారం రోజులు బట్టి భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నది. ఈనెల 23 వ తేది నాడు 51.5 అడుగులకి చేరుకున్నది .భద్రాద్రి గోదావరి నీటిమట్టం ఆ తర్వాత 44 అడుగుల తగ్గింది .అయితే మళ్లీ ఎగువ నుంచి వచ్చిన వరద వల్ల…