భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరద తో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది .ఈ నేపథ్యంలో గత వారం రోజులు బట్టి భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నది. ఈనెల 23 వ తేది నాడు 51.5 అడుగులకి చేరుకున్నది .భద్రాద్రి గోదావరి నీటిమట్టం ఆ తర్వాత 44 అడుగుల తగ్గింది .అయితే మళ్లీ ఎగువ నుంచి వచ్చిన వరద వల్ల…
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, దీనిపై ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ.. పోలీసుల వైఫల్యం వల్లే నేరాల రేటు పెరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. లా అండ్ ఆర్డర్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించిన ముఖ్యమంత్రి చాలా అరుదుగా శాంతిభద్రతలపై సమీక్షించారని ఆయన అన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ సాధించగలిగిన పెట్టుబడులు శాంతియుత రాష్ట్రంగా గుర్తింపు పొందాయి. కానీ ప్రస్తుత పరిస్థితి తెలంగాణకు అసాధారణంగా ఉంది. శాంతి భద్రతలు పూర్తిగా…
తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా.. రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా.. ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం…
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కొడంగల్‌లో భారీ వంటశాల ఏర్పాటు చేసేందుకు హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మెగా వంటశాల ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 28 వేల మంది పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. ఇవాళ హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా…
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ జైపాల్ రెడ్డి ఒక సిద్ధాంతకర్తగా పనిచేశారని, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది,కానీ అధికారంలోకి రాలేదన్నారు. 2014 ఎన్నికల్లో స్వర్గీయ జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రకటించినుంటే అధికారంలోకి…
ఏఐఎంఐఎం ఫ్లోర్‌లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీకి కొండంగల్ సీటును ఆఫర్ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బోనాల పండుగలో పాల్గొనేందుకు పాతబస్తీకి వచ్చిన సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒవైసీ పోటీ చేస్తే డిపాజిట్ గల్లంతు అవుతుందని అన్నారు. అవాస్తవ లక్ష్యాల కోసం ఒవైసీ తెలంగాణ బడ్జెట్‌ను తుంగలో తొక్కారు. ఓడిపోయేలా చూస్తాం అని అన్నారు. ఎఐఎంఐఎంను అవకాశవాద పార్టీగా…
తెలంగాణ రాష్ట్ర పోలీసులు 2024 జనవరి 1 నుండి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ పరికరాలను విజయవంతంగా రికవరీ చేసి, దేశంలో రెండవ స్థానంలో నిలిచారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి ఓ టి) సి ఈ ఐ ఆర్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను అధికారికంగా 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పోర్టల్ 2023 ఏప్రిల్ 19 నుండి ప్రయోగాత్మకంగా…
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్‌రాజు పదవి కాలం ముగిసింది. ఆ పదవికి ఈసారి అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఈ సారి పిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిని పంపిణీ రంగం నుంచి ఇచ్చారు. గతేడాది సినీ నిర్మాత అయిన దిల్ రాజుకు అవకాశం ఇచ్చారు. దిల్ రాజు పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు. ఏడాదికోసారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు…
ఢిల్లీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదనీరు రాత్రి రౌస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి చేరింది.. దీంత… ముగ్గురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల్లో మంచిర్యాలకు చెందిన విద్యార్థిని సోని ఒకరు. శ్రీరామ్‌పూర్-1 భూగర్భగని మేనేజర్‌గా పనిచేస్తున్నారు సోని తండ్రి విజయ్ కుమార్. ఏడాది క్రితం ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సోనీ కోచింగ్ సెంటర్లో చేరింది. తమ కుమార్తెను కాలేజీలో చేర్పించేందుకు నాగ్‌పూర్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రులు సోని మృతదేహాన్ని మళ్లీ…
‘స్థూలకాయం’ , ‘వ్యాధులు , మెదడు యొక్క రుగ్మతలు’ చికిత్సకు సంబంధించిన తప్పుదారి పట్టించే కొన్ని మందులను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్వహించిన దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో యాదాద్రి-భువనగిరి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జె.అశ్విన్ కుమార్ నేతృత్వంలోని బృందం మధ్యప్రదేశ్‌లోని సిద్ధ్-ఆయు ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఫౌండేషన్ తయారు చేసిన ఆయుర్వేద ఔషధమైన త్రిఫల గుగ్గులు మాత్రలను గుర్తించింది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఓ మెడికల్ షాపులో సోదాలు నిర్వహించి, ‘ఊబకాయం’కు చికిత్స చేస్తుందని…