కష్టపడి సంపాదించి.. కొంచెకొంచెం కూడబెట్టుకొని భవిష్యత్ ప్రణాళికల కోసం పోగు చేసుకుంటున్న డబ్బులను గద్ద వచ్చి పామును తన్నుకుపోయిన విధంగా చిట్టీల పేరుతో లూటీ చేస్తున్నారు కొందరు. ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఎలియాబాబు అలియాస్ రవి అనే వ్యక్తి పప్పుల చిట్టీల పేరుతో చిట్టీ వ్యాపారం మొదలుపెట్టారు. అయితే తనను నమ్మి ఎంతో మంది ఖాతాదారులు, ఏజెంట్లు రవి దగ్గర చిట్టీలు వేయడం మొదలు పెట్టారు. ఖాతాదారులకు, ఏజెంట్లను నమ్మకం కుదిరేంతవరకు మంచిగా నటించిన రవి.. 5 కోట్ల మేరకు వసూల్లు అవడంతో ఆ డబ్బుతో ఊడాయించాడు. దీంతో ఆందోళన చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
అయితే వేల సంఖ్యలో పప్పుల చిట్టీ ఖాతాదారులు మోసపోయినట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండడంతో రవిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు. చివరికి రవిని బుచ్చయ్యపేట పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. అయితే రవి బ్యాంక్ అకౌంట్స్ పరిశీలిస్తున్న పోలీసులు.. జనం డబ్బును బంధువుల ఖాతాల్లోకి మళ్ళించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఏజెంట్ 3 లక్షల నుంచి 80లక్షల వరకు జమచేసినట్లు సమాచారం.