రైలు పట్టాలు తప్పి 7గురు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ జల్‌పైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో పట్టాలు అదుపు తప్పింది. దీంతో రైలులోని 12 బోగీలు ఒకదానివెంట మరొకటి బోల్తా కొట్టాయి. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందినట్లు, మరో 50 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై ఇండియన్ రైల్వే,…
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపురం నుంచి దువ్వాడకు చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ తాడేపల్లిగూడెం వద్ద బోల్తా కొట్టింది. లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు మరో 6గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై లారీ బోల్తా కొట్టడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్…
భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరానంటాయి. వేకువజామునే భోగి మంటలు వేసి కోలాహలంగా కుటుంబ సమేతంగా అందరూ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా కారంచేడులోని తన సోదరి పురందేశ్వరి నివాసంలో నందమూరి బాలకృష్ణ భోగి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని, పంటలు ఇంటికి…
తెలువారందరి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లిన వారందరూ ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే భోగి, మకర సంక్రాంతి, కనుమగా ఇలా మూడు రోజులు పండుగను అత్యంత వైభవోపేతంగా తెలుగువారందరూ జరుపుకుంటారు. అయితే నేడు భోగి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో వేకువజామునే భోగి మంటలు వేశారు. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ శోభను సంతరించుకుంది. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల…
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వర్షాపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కాల్వలో చెత్తచెదారం తీయకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా భారీ వర్షం కారణంగా పలు కాలనీల్లో వర్షపు నీరు చేరడంతో అధికారులు వర్షపు నీటిని తోడుతున్నారు. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగి రహదారులపై ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా.. నైరుతి బంగాళాఖాతం…
బీజేపీ విచ్ఛిన్నకర విధానం అమలు చేస్తోందని, తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. బీజేపీ పట్ల టీఆర్‌ఎస్ మెతక వైఖరి అవలంబిస్తోందని, ఈ మధ్య బీజేపీ ఒడిపోవాలని కేసీఆర్ స్టేట్ మెంట్ ఇస్తున్నారు.. సంతోషమేనని ఆయన అన్నారు. కానీ కేసీఆర్ ప్రకటనలే వస్తున్నాయి.. కానీ ఆయన స్టేట్ మెంట్ ఎక్కడ లేదని ఆయన పేర్కొన్నారు.…
అకాల వర్షాల వల్ల ఉమ్మడి వరంగల్, ఖమ్మం రైతులు తీవ్రంగా నష్టపోయారని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకీల విత్తనాల కారణంగా మిర్చి రైతులకు వచ్చే క్వింటాల్ మిర్చి కూడా అకాల వర్షాలతో రాకుండా పోయిందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల భారీ వర్షాలకు ధాన్యం తడిచిపోయిందని ఆయన వెల్లడించారు. దాదాపు 500 కోట్ల పంట నష్టం జరిగిందని, పంట నష్టం జరిగితే ఏడేళ్లలో ఇంత…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బండి సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం బంద్ చేయాలంటూ అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎరువుల ధరలు…
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని 3వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే కార్యాలయం కిందకు పరుగులు పెట్టారు. అంతేకాకుండా 5వ అంతస్థులోని సిబ్బంది భయంతో ఆఫీస్ టెర్రస్‌పైకి ఎక్కారు. వీరితో పాటు ఓ ఇద్దరు ఉద్యోగులు ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీస్ లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది…
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన చంద్రయ్య అనే వ్యక్తిపై నిన్న రాత్రి కత్తులతో, కర్రలతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యచేశారు. ఈ నేపథ్యంలో చంద్రయ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. హత్యా రాజకీయాల వారసుడు జగన్ సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందిని ఆయన ఆరోపించారు.…