ఇటీవల కేంద్రం ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణయంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దేశానికి అన్నం పెట్టే రైతును ఇంత గోస పెడతారా…? పండగ పూట ఎరువుల ధరలు 50% నుండి 100% కు పెంచుతారా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దుర్మార్గపు చర్యలను ఎక్కడికక్కడ నిలదీయాలని, రాష్ట్ర బీజేపీ నాయకులు పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని తమ కేంద్ర నాయకత్వాన్ని…
మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత చంద్రయ్యపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. అయితే చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత పాల్గొని మాట్లాడుతూ.. వైసీపీ హత్యారాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దీనిపై స్పందంచిన ఎమ్మెల్యే జోగిరమేశ్ హత్యా రాజకీయాలకు పేటెంట్ అంతా చంద్రబాబుదేనని అన్నారు. ఒంటరిగా మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేకే చంద్రబాబు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని, పొత్తుల ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ప్రజలకు అభివృద్ది సంక్షేమ ఫలాలు బ్రహ్మాండంగా అందుతున్నాయని,…
సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. అయితే కోడి పందాలు సంప్రదాయ బద్ధంగానే నిర్వహించాలని కోర్టులు తెలుపుతున్నా.. కోర్డుల ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉంది, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెంలో భారీగా తమ కోళ్లను బరిలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముమ్మిడివరం, రామచంద్రాపురం, కాకినాడ, రాజానగరం, ఐ.పోలవరం,…
సినీ ఫక్కిలో బస్సు దోపిడీకి యత్నించారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భైంసా నుంచి నవీపేట్ మీదుగా హైదరాబాద్‌కు భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున బయలు దేరింది. అయితే నవీపేట్ మండలం అబ్బాపూర్ (ఎం) గ్రామ సమీపంలోకి బస్సు రాగానే నలుగురు దుండగులు రాళ్లతో బస్సుపైకి దాడి చేసి దోపిడీ యత్నించారు. దీంతో ప్రతిఘటించిన ప్రయాణీకులు.. గట్టిగా కేకలు వేయడంతో ఆ నలుగురు దుండగులు…
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నేడు భోగి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేకుకవజామునే భోగి మంటలు వేసి చిన్నాపెద్దా తేడాలేకుండా ఆడిపాడారు. అయితే ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ వరుణుడు విజృంభిస్తుండడంతో తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలకు బ్రేక్ పడింది.…
అత్యంత వైభవోపేతంగా సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఉద్యోగ, వ్యాపారం కోసం ఎక్కడెక్కడో ఉన్న కుటుంబీకులందరూ సంక్రాంతి పండుగకు ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు,…
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాద సంఘటన స్థలాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనపై చట్టబద్ధమైన విచారణ ప్రారంభించామన్నారు. అంతేకాకుండా ప్రధాని మోడీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడి ప్రార్థిస్తున్నానన్నారు. అయితే నిన్న సాయంత్రం రైలు పట్టాలు తప్పి 7గురు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ జలపైగురి జిల్లాలోని…
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న వేళ సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ పరిటాల శ్రీరామ్‌కు కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. అయితే స్వల్పలక్షణాలతో ఆయన కరోనా పాజిటివ్‌గా తేలిందని, ఇటీవల తనను కలిసివారందరూ జాగ్రత్తగా ఉండండని ఆయన తెలిపారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే.. కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది. దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్…
సింహాద్రి అప్పన్నను శ్రీశారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి మంటలు వెలిగించి స్వామిజీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సారి భోగి, సంక్రాంతి, కనుమకు ముందురోజు వైకుంఠ ఏకాదశి రావడం ఎంతో అదృష్టమని ఆయన అన్నారు. అదేవిధంగా భోగి మంటలు ఈ మంచి సమయంలో ప్రారంభించడం మహాత్భాగ్యంగా భావిస్తున్నాననన్నారు. ముఖ్యంగా ఈ…
తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటల దగ్గర పిల్లలు, పెద్దల కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. భోగి మంటల వద్ద చిన్నారులు కోలాటలతో ఆడిపాడారు. హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తాజా ప్రధాని మోడీ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో…