ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత కఠిన శిక్షలు వేసిన కామాంధులు మాత్రం మారడం లేదు. అన్యం పుణ్యం తెలియని చిన్నారులపై మృగాళ్ల పడి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో నిన్న 6 ఏళ్ల చిన్నారిపై గుర్రం కిషోర్ (28) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. అయితే సదరు అమ్మాయి తమ్ముడు అరవడంతో నిందితుడు గుర్రం కిషోర్ పారిపోయాడు. ఈ నేపథ్యంలో నేడు పెద్దమనుషుల…
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 1న జీతం రావడం లేదు.. పింఛన్ ఇవ్వడం లేదు.. ఏపీ లో ఖజానా ఖాళీ అయింది…ప్రభుత్వం దివాళా తీసింది అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ద్వారా వేతనం పెంచకుండా తగ్గించిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఏపీలో…
టెలికం దిగ్గజం జియో దేశంలోని టాప్ 1,000 నగరాలకు 5జీ నెట్‌వర్క్ కవరేజ్ ప్లానింగ్‌ను పూర్తి చేసిందని, దాని ఫైబర్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు సైట్‌లలో పైలట్‌ను నడుపుతోందని కంపెనీ సీనియర్ అధికారి ప్రెజెంటేషన్ సందర్భంగా తెలిపారు. భారతదేశంలో 5జీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి కంపెనీ బృందాలను రూపొందించినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. “దేశవ్యాప్తంగా 1,000 అగ్ర నగరాలకు 5జీ కవరేజ్ ప్రణాళిక పూర్తయింది. జియో తన 5జీ…
తెలంగాణకు కొత్త రైల్వే లైన్లు, కోచ్ ఫ్యాక్టరీ కోసం నిధులు తీసుకురావడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారని తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో వరంగల్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ లు విరుచుకుపడ్డారు. రైల్వే లైన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం నిధులు విడుదల చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలిద్దరూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గిరిజన మహిళలపై విచక్షణ రహితంగా ఓ అటవీ శాఖ అధికారి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జిల్లాలోని ములకలపల్లి మండలం సాకివలస గ్రామంలో ఆదివాసీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఫారెస్ట్ బీట్ గార్డు మహేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు పోటు రంగారావు డిమాండ్ చేశారు. కట్టెలు కొట్టేందుకు అడవికి వెళ్లిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ గార్డు దాడికి…
ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో కుమారుడి అంత్యక్రియల సందర్భంగా హెల్మెట్ వినియోగించాలంటూ ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కలచివేసింది. ఖమ్మం బస్టాండ్ సమీపంలో జనవరి 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్ గ్రామం వద్ద సోమ్లానాయక్ తండాకు చెందిన తేజావత్ సాయి(18) తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అంతిమయాత్రలో ఉన్న యువకుడి తండ్రి తేజావత్ హరి తన కుమారుడి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు.…
గుడివాడలో జరిగిన ఘటనలో కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు వెల్లడించారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఆరుగురు సభ్యులతో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చామని, కానీ నిబంధనలు అతిక్రమించి వందలాది మందితో టీడీపీ నాయకులు వచ్చారన్నారు. గుడివాడలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను కృష్ణా జిల్లా పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ, చాకచక్యంగా అదుపు చేశారని…
గుడివాడలో సంక్రాంతి పండుగ రోజున మంత్రి కొడాలి నాని కి చెందిన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించారని, టీడీపీ నిజ నిర్దారణ కమిటీ ఈ ఘటనపై వాస్తవాలను బయటపెట్టేందుకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. నిజ నిర్దారణకు వచ్చిన తమపై దాడి పోలీసులు పట్టించుకోలేదని, డీజీపీ పనికి మాలిన వాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.…
విజయనగరం మైన్స్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డికి ఆ శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బినామీ మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నారని ప్రతాప్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇటీవల ప్రతాప్ రెడ్డికి సంబంధించిన ఆడియో వైరల్ అవడంతో స్థానికంగా కలకలం రేగింది. అంతేకాకుండా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియా ముందుకు వచ్చిన ప్రతాప్ రెడ్డి.. గనుల శాఖలో కొందరు అధికారులు, మైనింగ్ మాఫియాతో చేతులు కలిపారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ప్రతాప్ రెడ్డిపై…
ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ అనుమతించమని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలను.. ట్రేడ్ యూనియన్ నేతలను మాత్రం ఉద్యమంలోకి అనుమతిస్తామని, సీపీఎస్ రద్దు అంశంపై గట్టిగా ఉద్యమిస్తామన్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న నోటీసు ఇస్తామని, 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడుతామన్నారు.…