మార్కెట్ చూపిన బలమైన వృద్ధి ఔట్‌లుక్‌ను దృష్టిలో ఉంచుకుని, జాతీయ, నగర ఆధారిత కంపెనీలకు చెందిన అనేక రెసిడెన్షియల్ డెవలపర్‌లకు హైదరాబాద్ విస్తరణ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ జోరు 2022 మరియు అంతకు మించి కొనసాగుతుందని భావిస్తున్నారు.ప్రెస్టీజ్ గ్రూప్ ఇటీవల హైదరాబాద్‌లో ఒక ప్రధాన నివాస అభివృద్ధిని ప్రారంభించింది. ఇది కోకాపేట్‌లోని అభివృద్ధి చెందుతున్న వాణిజ్య, నివాస కేంద్రంగా ఉంది. ఇది మూడు ఎత్తైన టవర్‌లతో (మూడు మరియు నాలుగు…
రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర వాటాగా రాబోయే యూనియన్ బడ్జెట్‌లో రూ.7,778 కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం కోరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ కేపీహెచ్ బీ-కోకాపేట్-నార్సింగి కారిడార్, వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్ట్‌తో పాటు మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (MRTS), మెట్రో నియో నెట్‌వర్క్‌తో సహా పలు ప్రాజెక్టులకు నిధులు కోరారు. స్ట్రాటజిక్…
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాంతాల్లోని పంటల సాగు, ఇతర అంశాల ఆధారంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) నిర్ణయించాలని, రాష్ట్రాలు నిర్ణయించిన ఎంఎస్‌పీకి కేంద్రం మొత్తం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వ్యవసాయ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగంపై కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాలని పేర్కొంటూ, “కేంద్రం ఎమ్‌ఎస్‌పిని ప్రకటించి, సేకరణ బాధ్యతల నుండి చేతులు కడుక్కుంటోంది. ఇది శోచనీయం.” స్వామినాథన్ కమిటీ సిఫార్సులను…
శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య 216 అడుగుల ఎత్తైన విగ్రహం ఫిబ్రవరి 5న ప్రపంచానికి అంకితం కానున్నది. కూర్చున్న స్థానంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా పేర్కొనబడిన ఈ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నట్లు చిన జీయర్ స్వామీజీ ఆశ్రమం ఓ ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నగర శివార్లలోని 45 ఎకరాల కాంప్లెక్స్ వద్ద, రూ. 1,000 కోట్ల ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చబడింది.…
నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు వంటి అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా గురువారం నాల్గవ రోజు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 12 పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. మొత్తంగా గత నాలుగు…
నేటి సమాజంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు గొడవపడి క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇది.. భర్త తలను భార్య విచక్షణ రహితంగా నరికి చంపినా ఘటన ఏపీలోని రేణుగుంటలో చోటుచేసుకుంది. గురువారం రేణిగుంటలోని ఓ మహిళ తన భర్త తలను నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. పోలీస్ లైన్స్ రోడ్డులో రవిచంద్రన్ (53), వసుంధర అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి…
కోర్టు ప్రాంగణంలో భార్య బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తెనాలి కోర్టు ప్రాంగణంలో పెట్రోల్ బాటిల్‌తో ఓ వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. కోర్టు ప్రాంగణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు చెరుకూరి ప్రదీప్ రామచంద్ర యత్నించారు. భార్యాభర్తల మధ్య విభేధాల నేపథ్యంలో కోర్టులో కేసుల విచారణ సాగుతోంది. అయితే కేసుల విషయంలో తన తప్పు లేకున్నా తన భార్య బూటకపు ఫిర్యాదుల మేరకు వన్‌టౌన్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లైటర్‌తో…
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను తీవ్రం చేయడమే కాకుండా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ కేరళలో మాత్రం కరోనా కాంప్రమైజ్ కానంటోంది. తాజాగా…
దేశంలో మిర్చి ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా 60 శాతమని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 40 శాతమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవీఎల్ నరసింహారావు అన్నారు. “తామర తెగులు” కారణంగా ఏపీ తెలంగాణలో మిర్చి పంట దారుణంగా దెబ్బతిందని, ఆంధ్రప్రదేశ్ లో మిర్చి పంట సాగు 2 లక్షల హెక్టార్లకు పైగా ఉందన్నారు. తెలంగాణలో లక్ష ఎకరాలకు పైగా పంట సాగు జరిగిందని, 25 మంది శాస్త్రవేత్తలు, పంట నిపుణులతో…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లిలో అయన నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అదానీ, అంబానీల చేతుల్లో పెట్టిన ఘనత బీజేపీకే దక్కిందని ఆయన విమర్శించారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి దమ్ముంటే భారతదేశమంతా దళిత బంధు అమలు చేయించాలని మంత్రి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని…