Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. పాకిస్తాన్‌కి చెందిన లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ దాడి చేసింది.
బైసరన్ లోయను తమ ఆధీనంలోకి ఉగ్రవాదులు తీసుకుంటున్న విజువల్స్ ను అందులో చూపించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన సమయంలో తాను జిప్ లైన్లో ఉన్నానని తెలిపాడు.. ఆ వీడియోలో, నా వెనుక ఉన్న ఒక వ్యక్తి 'అల్లాహు అక్బర్' అని అరుస్తున్నట్లు మీరు చూడవచ్చు.. ఆ వెంటనే కాల్పులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నాడు.
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని ఫ్రంట్ ఆర్గనైజేషన్ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఈ దాడి చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెు పాక్ హస్తం ఉందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్‌ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా వేట కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా, ఉగ్రవాదులకు సంబంధించి ఇళ్లను భద్రతా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. గత 48 గంటల్లో, భద్రతా బలగాలు, స్థానిక అధికారుల సమన్వయంతో జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చేసి, ఉగ్రవాదికి వ్యతిరేకంగా తమ చర్యల్ని ముమ్మరం చేశాయి.
Hafiz Saeed: లష్కరే తోయిబా చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సింధు నది జలాల ఒప్పందం రద్దు గురించి ఉగ్రవాది మాట్లాడిన వీడియోని ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కావాలని వైరల్ చేస్తోంది.
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్‌తో జరిగిన సంభాషణలో ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదానికి నిధులను అందించడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని అంగీకరించారు. తాము 30 సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఒక అగ్ర ఉగ్రవాది హతమయ్యాడు. లష్కర్ ఉగ్రవాది అల్తాఫ్ లాలిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం ఉదయం నుంచి బండిపోరాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
అనంత్‌నాగ్ జిల్లా బిజ్బెహారాలోని గోరి ప్రాంతంలో ఉన్న పహల్గామ్ దాడిలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిపై భద్రతా దళాలు బాంబు దాడి చేశాయి. ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గుర్రీగా గుర్తించబడిన ఉగ్రవాది.. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన దాడిని ప్లాన్ చేయడం, అమలు చేయడంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో పాల్గొన్న మరో స్థానిక ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ట్రాల్లో ఉన్న ఇంటిని…
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే (LET) కమాండర్ సైఫుల్లా కసూరి పేరు బయటకు వచ్చింది. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇతడు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.