Vikram Misri : పాకిస్థాన్ తప్పించుకోవాలని చూస్తోంది.. విదేశాంగ కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ గురించి ఎంఈఏ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రసంగించారు.. పహల్గామ్‌పై దాడి రెచ్చగొట్టారు. అందుకే నిన్న ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని మరోసారి స్పష్టం చేశారు. పహల్గామ్ దాడికి లష్కరేతో సంబంధం ఉన్న ఒక సంస్థ బాధ్యత వహించిందని.. ఐక్యరాజ్యసమితి పత్రికా ప్రకటనలో టీఆర్‌ఎఫ్ పేరు ప్రస్తావించడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంఘటన నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తోందన్నారు. పాకిస్థాన్ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువు అని పునరుద్ఘాటించారు. ప్రపంచంలో అనేక ఉగ్రవాద దాడులు జరిగాయని.. ఇందులో పాకిస్థాన్ హస్తం ఉందని తేలినట్లు చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? అతన్ని అమరవీరుడు అని ఎవరు పిలిచారు? అని ప్రశ్నించారు.
READ MORE: CM Revanth Reddy: హైడ్రా అంటే కూల్చడమే కాదు.. ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కూడా..!
Also Read
ఈ దాడికి సంబంధించి ప్రపంచాన్ని పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిందని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ నిలయంగా మారిందని.. ఇందులో మసూద్ అజార్, హఫీజ్ మొహమ్మద్ సయీద్ ఉన్నారన్నారు. భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటోందని.. ఉగ్రవాదుల రహస్య స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని పునరుద్ఘాటించారు. “పాకిస్థాన్ పహల్గామ్ దాడిపై ఉమ్మడి దర్యాప్తు చేయాలని ప్రతిపాదన తెచ్చింది. మరోసారి తనను తాను రక్షించుకోవడానికి ఇది ఒక వ్యూహం. 26/11, పఠాన్‌కోట్ వంటి దాడుల దర్యాప్తులో భారతదేశం సహకరించింది. కానీ పాకిస్థాన్ ఆ కేసులను పక్కన పెట్టింది. ముంబై దాడిపై వివరణాత్మక ఆధారాలు అందించినప్పటికీ.. ఎటువంటి ఖచ్చితమైన చర్య తీసుకోలేదు. పఠాన్‌కోట్ కేసులో డీఎన్‌ఏ విశ్లేషణ, ఉగ్రవాద సంస్థల అధికారుల సమాచారాన్ని పాకిస్థాన్ బృందానికి అందించాం. కానీ ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదు.” అని మిస్రీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!