Terrorists Killed: ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన అబు జిందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా, మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని భారత భద్రతా దళాలు ప్రకటించాయి.
ఆపరేషన్ సిందూర్ గురించి ఎంఈఏ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రసంగించారు.. పహల్గామ్‌పై దాడి రెచ్చగొట్టారు. అందుకే నిన్న ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని మరోసారి స్పష్టం చేశారు. పహల్గామ్ దాడికి లష్కరేతో సంబంధం ఉన్న ఒక సంస్థ బాధ్యత వహించిందని.. ఐక్యరాజ్యసమితి పత్రికా ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరు ప్రస్తావించడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంఘటన నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తోందన్నారు. పాకిస్థాన్ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువు…
Asaduddin Owaisi: AIMIM పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఉగ్రవాదంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంపై జిహాద్ పేరిట హత్యలు చేయాలని పాకిస్తాన్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని, పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించిన లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)పై అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అన్నారు. Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్‌కి దెబ్బ, చైనాకు…
పహల్గామ్లో హిందువుల ఊచకోతకు పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీఓకే వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 రహస్య స్థావరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్థాన్‌పై జరిగిన ఈ దాడికి భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్" అని పేరు పెట్టింది. ఈ దాడి తర్వాత.. మొత్తం పాకిస్థాన్‌లో భయానక వాతావరణం నెలకొంది.
కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం "ఆపరేషన్ సిందూర్" నిర్వహించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, భారత వైమానిక దళం, భారత సైన్యం, నావికాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో క్షిపణులు ప్రయోగించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.
భారత్ సైన్యం చేసిన దాడిలో 4 జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్‌లోని బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఈ హెడ్‌క్వార్టర్ ఉంది. సుమారు, 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం నుంచే 2019లో పుల్వామా దాడికి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు.
Terrorist: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడి విచారణలో కుల్గాంకు చెందిన ఇంతియాజ్ మహ్మద్ లష్కరే తోయిబా స్లీపర్ సెల్ సభ్యుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఉగ్ర దాడికి సంబంధించి జరిపిన దర్యాప్తులో ఇంతియాజ్ పాత్ర బయటపడిందని అన్నారు.
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. పాకిస్తాన్‌కి చెందిన లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ దాడి చేసింది.
బైసరన్ లోయను తమ ఆధీనంలోకి ఉగ్రవాదులు తీసుకుంటున్న విజువల్స్ ను అందులో చూపించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన సమయంలో తాను జిప్ లైన్లో ఉన్నానని తెలిపాడు.. ఆ వీడియోలో, నా వెనుక ఉన్న ఒక వ్యక్తి 'అల్లాహు అక్బర్' అని అరుస్తున్నట్లు మీరు చూడవచ్చు.. ఆ వెంటనే కాల్పులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నాడు.
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు.