Pakistan: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు బయలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెర్రరిస్టులకు స్వర్గధామంగా ఉన్న పాక్‌లో జిహాదీలు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి, అత్యంత సమీపం నుంచి చంపిపారిపోవడం అక్కడ నిత్యకృత్యంగా మారింది.
Pakistan: పాకిస్తాన్ దేశంలో వరసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రావడం, ఉగ్రవాదిని పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపేసి అంతే వేగంతో మాయమవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు భారత వ్యతిరేక ఉగ్రవాదులు 19 మంది ఇలాగే చనిపోయారు. ఆదివారం రోజు లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన కీలక ఉగ్రవాది హబీబుల్లాని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో కాల్చి చంపారు.
Pakistan: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల రహస్య హత్యల మధ్య ప్రధాన సమాచారం వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ టెర్రరిస్ట్, లష్కర్ కమాండర్ సాజిద్ కూడా ఆసుపత్రిలో చేరాడు.
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లో గుర్తు తెలియని దుండగులు ప్రముఖ మత గురువు నాత్ ఖవాన్ మౌలానా రహీముల్లా అలియాస్ మౌలానా రహీముల్లా తారిఖ్‌ను హతమార్చారు. ఈ ఘటన కరాచీలో జరిగింది.
Pakistan: పాకిస్తాన్‌లో అసలేం జరగుతోంది. ఎవరికీ అంతుచిక్కకుండా గుర్తు తెలియని వ్యక్తులు భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని లేపేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు ఇలాగే చంపివేయబడ్డారు. తాజాగా మరో ఉగ్రవాదిని లేపేశారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ని కరాచీ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
Hafiz Saeed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ కొడుకు కమాలుద్దీన్ హత్యకు గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 27న కమాలుద్దీన్ సయూద్ని గుర్తు తెలియని వ్యక్తుల పెషావర్ నుంచి కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అతన్ని హత్య చేశారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
Hafiz Saeed: దాయాది దేశం పాకిస్తాన్ లో ఏదో జరుగుతోంది వరసగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమవుతున్నారు. దీంతో అక్కడ ఉన్న ఉగ్రవాదుల్లో భయం మొదలైంది. రెండుమూడు రోజుల క్రితం జియావుర్ రెహ్మన్ అనే హిజ్బుల్ ముజాహిద్ధీన్ ఉగ్రవాదిన కరాచీలో హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తుల వచ్చి ఆయన్ని హతమార్చారు. కాశ్మీర్ లో హిజ్బుల్ తరుపున ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసే పనిని ఈ ఉగ్రవాది చేసేవాడు.
Khalistan: భారతదేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా ఖలిస్తాన్ ఉగ్రసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో రాడికల్ సిక్కులు భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఇతను కూడా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)పేరుతో ఉగ్రవాద సంస్థను నడుపుతున్నారు.
Kulgam Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యానికి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. రాత్రి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉగ్రవాదులు తప్పించుకోగలిగారు.