జమ్ము & కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్స్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్స్‌ని నిర్వహించారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్‌కు చెందినవాడని, లష్కరే తోయిబా సంస్థ కోసం పని చేస్తున్నాడని తెలిసింది. కొంతకాలం క్రితం అరెస్ట్ చేసిన షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా.. సైన్యంతో కలిపి పోలీసులు కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల శిబిరాల్ని గుర్తించి, చుట్టుముట్టారు. ఇది…
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇటీవల కాలంలో దాదాపుగా రోజు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కాశ్మీర్ లోని బెమీనా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి బలగాలు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి. గతంలో సోపోర్ ఎన్…
జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు, పోలీసులు ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు. తాజాగా గత రాత్రి మరో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అవంతి పొరా, శ్రీనగర్ ఎన్ కౌంటర్లలో నలుగురు లష్కర్ ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్ లో టీవీ ఆర్టిస్ అమ్మీన్ భట్ ను ఒక రోజు ముందు ఉగ్రవాదులు హతమర్చారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను 24 గంటలు తిరగకముందే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శ్రీనగర్…