పహల్గామ్‌లో హిందువుల ఊచకోతకు పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీఓకే వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 రహస్య స్థావరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్థాన్‌పై జరిగిన ఈ దాడికి భారత సైన్యం “ఆపరేషన్ సిందూర్” అని పేరు పెట్టింది. ఈ దాడి తర్వాత.. మొత్తం పాకిస్థాన్‌లో భయానక వాతావరణం నెలకొంది. అయితే.. పాక్- భారత్ మధ్య వివాదం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలతో ప్రారంభమైంది.. గత నెలలో కశ్మీర్ తమ జీవనాడి లాంటిదని పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్ వ్యాఖ్యానించాడు. ప్రతి విషయంలోనూ హిందూ ముస్లింలు భిన్న ధ్రువాలని, అందుకే తమ పూర్వీకులు రెండు దేశాలుండాలని పట్టుబట్టి సాధించారని పేర్కొన్నాడు.
READ MORE: Ponnam Prabhakar: “ఆపరేషన్ సింధూర్” విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న మంత్రి!
ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ ప్రవాస పాకిస్థానీల తొలి సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘మన ఉద్దేశం స్పష్టం. కశ్మీర్ గతంలోనూ మన గొంతులోని రక్తనాళంలా ఉండేది. భవిష్యత్తులోనూ ఉంటుంది. దానిని మనం ఎప్పటికీ మరిచిపోలేం. మన కశ్మీరీ సోదరుల పోరాటంలో.. వారిని ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్థాన్ కథను చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారు. మన మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవి. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనవి రెండు దేశాలు’ అని మునీర్ వ్యాఖ్యానించాడు.
READ MORE: YCP: వైసీపీలో చేరిన మాజీ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్!
ఈ వ్యాఖ్యలు చేసిన వారం రోజుల్లోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ వైఫల్యాన్ని దాచడానికి అసిమ్ మునీర్ నిరంతరం భారతదేశ వ్యతిరేక ప్రకటనలు చేశాడు. తమ సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధ నినాదాలు చేశాడు. “పాకిస్థాన్ భూమిలోని ప్రతి అంగుళాన్ని మేము రక్షిస్తాము. భారతదేశానికి తగిన సమాధానం చెప్తాం.” అని గప్పాలు కొట్టాడు. ఇప్పుడు భారతదేశం పాకిస్థాన్ పై తిరగబడటం, ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినా.. అసిం మునీర్ మౌనంగా ఉన్నాడు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మునీర్ ఎక్కడా కనిపించకపోవడం గమనించదగ్గ విషయం.
READ MORE: Operation Sindoor: “ఆపరేషన్ సిందూర్”లో బహవల్పూర్, మురిడ్కే దాడులే హైలెట్..
పాకిస్థాన్ సైన్యం దశాబ్దాలుగా దేశాన్ని నియంత్రిస్తుందని నమ్మిక. ఈ సైన్యం ఎల్లప్పుడూ ఉగ్రవాదులను వ్యూహాత్మక దాడుల కోసం ఉపయోగించుకుంటుంది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలకు సైన్యం బహిరంగ రక్షణ కల్పిస్తోంది. అంతర్జాతీయ విధివిధానాల ప్రకారం పాకిస్థాన్‌కు ఏ దేశం సపోర్ట్ చేయకూడదు.. భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సమూహాల స్థావరాలను నాశనం చేసింది. అందుకే అసిం మునీర్ ఈ దాడిపై స్పందించడం లేదని చెబుతున్నారు. వీడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదు. ఈ రోజు పాకిస్థాన్ ఆర్మీ నిర్వహించిన సమావేశానికి కూడా రాకపోవడం గమనార్హం.