ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఏళ్లతరబడి రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అక్కర్లేని రాద్ధాంతం జరుగుతోందని సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లాం చెప్పారు. ఈ చట్టం అమల్లోకి రావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం పడుతుందన్నారు. కోర్టు అనుమతి తర్వాతే చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రతి ఒక్కరికీ కాల్ చేసి, మెసేజ్ పెట్టి జగన్ మీ భూములు కాజేస్తాడని చెబుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు.
రేపటి నుంచి టైటాలింగ్ చట్టం అమల్లోకి వస్తుందనీ, ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ చాలా దారుణమని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టైటలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించారు గోరంట్ల బుచ్చియ్యచౌదరి
టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదని.. ఈ చట్టంపై అడ్వకేట్స్ కొన్ని అభ్యంతరాలు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో త్వరితగతిన రీ సర్వే పూర్తి అవుతుందని ఆయన ప్రకటించారు. ఇంకా రూల్స్ తయారు చేయలేదు , అసెంబ్లీ చర్చించలేదని.. న్యాయవాదుల సలహాలు తీసుకునేందుకు ప�