CM Chandrababu: ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20, 494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
Minister Narayana: అమరావతిలో మొదటి దశలో రైతుల దగ్గర తీసుకున్న 34 వేల ఎకరాల భూమి విలువ పెరగాలి అని మంత్రి నారాయణ తెలిపారు. కొత్త పరిశ్రమలు రావాలంటే ఎయిర్ పోర్టు ఉండాలని చెప్పుకొచ్చారు. రాబోయే 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.. ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కు సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది.
AP Cabinet Meeting: నేడు (జూన్ 24) ఉదయం 11 గంటలకు ఏపి క్యాబినెట్ భేటీ అమరావతి వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటు కు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450…
అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇంటి స్థలాల కోసం గత ప్రభుత్వ హయాంలో డి-ఫారం పట్టా, ఆక్రమిత భూములను సమీకరణపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశ్నించనుంది. ఇప్పటికే అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి ముఖ్య డాక్యుమెంట్లు, రికార్డులను సీఐడీ స్వాధీనం చేసుకుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ ఎమ్మెల్యేగా వున్న సమయంలో జరిగిన భూసమీకరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్ ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం…
అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఈరోజు కంటే ప్రత్యేకమైన రోజు మరి ఏది ఉండదలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మోడీని ఎప్పుడు కలిసిన చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని.. కానీ మొన్నటి సమావేశంలో అమరావతికి రమ్మని పిలవడానికి వెళ్తే.. తమ భేటీ చాలా గంభీరంగా సాగిందని గుర్తు చేశారు.
ఐదేళ్లపాటూ జగన్ తుగ్లక్ పాలనను అందించారని 2014 లో టీడీపీ ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపేశారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం నిలిపేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించిందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాల భూమి ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.64 వేల కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.
రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై ఎవ్వరికీ భయాందోళనలు అవసరం లేదన్నారు నారాయణ.. వాణిజ్య వ్యాపార లావాదేవీలు జరగాలంటే భూమి అవసరం.. పెద్ద పెద్ద కంపెనీలు.. పరిశ్రమలు రావాలి.. అందుకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో రావాలి.. ఇందుకోసం అదనపు భూమి అవసరం.. కానీ, భూ సేకరణ చేస్తే రైతులకు నష్టం జరుగుతుందన్నారు..
Amaravati: అమరావతి రాజధాని కోసం మరో 30 వేలు భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 5000 వేల ఎకరాల భూమి అవసరం అని అంచనా వేస్తుంది.
ఏపీలో రాజకీయ నాయకుల జీవితాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొండా పేరుతో కొండా సురేఖ జీవితాన్ని బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏపీలో మరో రాజకీయ నేత జీవితం తెరకు ఎక్కనుంది. ఆయనే వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఆయన జీవితం ప్రేక్షకుల ముందుకి రానుంది. జగన్ అభిమాని పేరుతో బయోపిక్ రాబోతోంది. ఈ సాయంత్రం పోస్టర్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. లోకల్ ఫోటో గ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన నందిగం…