ఐదేళ్లపాటూ జగన్ తుగ్లక్ పాలనను అందించారని 2014 లో టీడీపీ ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపేశారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం నిలిపేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించిందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాల భూమి ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.64 వేల కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.
READ MORE: India-Pak: ఈనెల 29తో అన్ని రకాల వీసాలు రద్దు.. పాకిస్థానీయులు వెళ్లిపోవాలని ఆదేశాలు
రాజధాని నిర్మాణం మరో మూడు సంవత్సరాల్లో పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలని వెల్లడించారు. రానున్న 50 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు, స్పోర్ట్ సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని పేర్కొన్నారు. ఇందుకు 8 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని.. రాజధాని నిర్మాణానికి మరికొంత భూమి అవసరం అవుతుందన్నారు. ల్యాండ్ అక్విజేషన్, ల్యాండ్ పూలింగ్ విషయంలో భూ యజమానులతో చర్చిస్తున్నామన్నారు.
READ MORE: Complete Star : నెల గ్యాప్ లో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన మెహన్ లాల్