Minister Narayana: అమరావతిలో మొదటి దశలో రైతుల దగ్గర తీసుకున్న 34 వేల ఎకరాల భూమి విలువ పెరగాలి అని మంత్రి నారాయణ తెలిపారు. కొత్త పరిశ్రమలు రావాలంటే ఎయిర్ పోర్టు ఉండాలని చెప్పుకొచ్చారు. రాబోయే 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.. ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కు సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది.. గతంలో తీసుకున్న 34 వేల ఎకరాల భూమి విలువ పెరగాలంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి అని పేర్కొన్నారు. అందు కోసమే 2500 ఎకరాలలో స్మార్ట్ సిటీ, 2500 ఎకరాల్లో స్పోర్ట్ సిటీ, 5000 ఎకరాలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అవసరం అని మంత్రి నారాయణ వెల్లడించారు.
Read Also: Rajasthan: మసీదు సమీపంలో రోడ్డు ప్రమాదం, మూకదాడిలో ఒకరు మృతి.. మత ఉద్రిక్తత..
అయితే, అదనపు ల్యాండ్ పూలింగ్ కు 7 గ్రామాలు అంగీకరించాయని మంత్రి పొంగూరు నారాయణ చెప్పుకొచ్చారు. 20, 494 ఎకరాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం లభించింది.. కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం వచ్చింది.. గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు, ఎంఎస్కే ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు, కిమ్స్ మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు, బీజేపీకి రెండు ఎకరాలు కేటాయించామని తెలిపారు. ఒకటి రెండు గ్రామ సభల్లో కొంత గందరగోళం ఉంది వాస్తవం.. అది కూడా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్న గ్రామాల్లో ఈ ఆందోళన జరుగుతుంది.. వైసీపీకి మళ్ళీ ఆ 11 సీట్లు రావడమే కష్టమే అన్నారు మంత్రి నారాయణ.