CM Chandrababu: ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20, 494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ భేటీకి పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు RFP పిలిచేందుకు ఆమోదం తెలిపగా.. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్, స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ ఎఫ్ పీ పిలిచేందుకు ఆమోదం తెలిపింది.
Read Also: Virgin Boys: ‘టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు’ అంటున్న “వర్జిన్ బాయ్స్”
ఇక, అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదం తెలిపింది. మందడం, తూళ్లురు, లింగాయపాలెంలో 2.5 ఎకరాల చొప్పున నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబీఎస్ ప్రాతిపదికనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ఇసుక డ్రెడ్జింగ్ కోసం సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. ప్రకాశం బ్యారేజి ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వుకునేందుకు సీఆర్డీఏ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. వచ్చే రెండేళ్లలో రాజధాని నిర్మాణానికి 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అంచనా వేసింది. భూముల కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
Read Also: UP: ఇనుప గేటు మీద పడి.. తల్లడిస్తూ ప్రాణాలు వదిలిన వాచ్‌మెన్.. సీసీటీవీ ఫుటేజీ..
అయితే, సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. రాజధానిలోని ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజుల స్మారక చిహ్నాల ఏర్పాటుకు స్థలం కేటాయించడానికి
ఆమోదం లభించింది.