భూ సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసింది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి చైర్మన్ గా.. జిల్లా మంత్రి.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే.. జాయింట్ కలెక్టర్.. ఆర్జీవో సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం విశాఖపట్నం ముఖ్యనేతలతో రెవెన్యూ.. ఎండోమెంట్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గత ప్రభుత్వంలో భూములను కొట్టేశారా అనే ఆలోచనలు ఉండేవి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నాం. సింహాచలం భూములపై గతంలో అనేక మంది హామీలు ఇచ్చారు. కానీ పూర్తి చేయలేకపోయారు.. ప్రస్తుతం పంచ గ్రామాల భూముల అంశంలో న్యాయపరమైన చిక్కులు…
వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. సెంటు భూమి నుంచి వేల ఎకరాల వరకూ వైసీపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందన్నారు. పరిశ్రమలు, పోర్టులను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. గత అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నాయకులు దోపిడీ చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ లో ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేరును బంజారాహిల్స్ పోలీసులు తొలగించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో శనివారం అభియోగ పత్రాలు సమర్పించారు. ఎలాంటి ఈ కేసులో ఆయన ప్రమేయం పై సాక్ష్యాధారాలు లేవని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10.5 పేర్కొన్నారు. ఏపీ జెమ్స్, జ్యువెలర్స్ కు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించడంతో పాటు తనను చంపేందుకు ప్రయత్నించారంటూ సెక్యూరిటీ ఇన్ఛార్జి పి. నవీన్…