Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీ హక్కులు ఎలా ఉంటోయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడి మైనారిటీలు అయిన హిందూ, సిక్కు, క్రైస్తవులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తుంటారు. మైనారిటీ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి మతం మార్చి పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ సర్వసాధారణం అయిపోయింది. మైనారిటీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నా.. పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే భారత్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ మొసలి కన్నీరు కారుస్తుంటుంది.
పాకిస్తాన్ లో స్వేచ్ఛ అనే పదానికి పెద్దగా అర్థం లేదు. అక్కడ పేరుకే ప్రజాస్వామ్యం నడిచేదంతా సైన్యం పాలన. ఇక మహిళల హక్కులు, స్వేచ్ఛకు అక్కడ అవకాశమే లేదు. చివరకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు కూడా మహిళల ర్యాలీపై నిషేధం విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
Pakistan: పాకిస్తాన్ లో ఇస్లామిక్ మతఛాందసవాదులు ఎంతలా పెరిగి పోయారంటే దైవదూషణ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ల పై దాడులు చేస్తూ ప్రజలను చంపేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్ పై కాల్పులు జరిపారు దుండగులు. మార్వియా మాలిక్ (26) లాహోర్ లో ఫార్మసీ నుంచి తన ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో తుపాకీ దాడికి గురైంది.
Bus Accident: పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లో పెళ్లి బృందంతో వేగంగా వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 15 మంది మృతి చెందారు.
Pakistan Witnesses Major Power Breakdown: దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పలుచోట్ల విద్యుత్ లేదు. దేశ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, కరాచీ నగరాల్లో అంధకారం అలుముకుంది. ట్రాన్స్మిషన్ లైన్లలో లోపం కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉదయం 7.30 గంటల నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాకిస్తాన్ జర్నలిస్ట్ అసద్ అలీ తూర్ ట్వీట్…
Punjab woman accuses Pak embassy staff: పాకిస్తాన్ ఎంబసీ సిబ్బంది ఓ మహిళ ప్రొఫెసర్ తో అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక కోరికల గురించి అడుగుతూ తిక్క ప్రశ్నలు వేశారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని సదరు మహిళ ఆరోపించింది. తన వీసా అపాయింట్మెంట్ కోసం పాక్ ఎంబీసీ వెళ్లినప్పడు సీనియర్ సిబ్బంది తప్పుగా వ్యవహరించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ కూడా రాశారు ఆమె. చర్యలు తీసుకోవాలని కోరారు.
మానవత్వం మంట కలిసింది.. తోటి స్నేహితురాలి పట్ల జాలి చూపాల్సిన ఓ యువతి.. రాక్షసంగా ప్రవర్తించింది. పాక్లో తన తండ్రిని పెళ్లి చేసుకోవాలంటూ మెడికల్ విద్యార్థినిపై ఒత్తిడి చేసింది తోటి స్నేహితురాలు. అందుకా యువతి నిరాకరించింది. తన కంటే వయస్సులో పెద్దవాడైన వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవాలని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె ఫ్రెండ్.. తండ్రితో కలిసి యువతిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టింది. అంతేకాదు.. సారీ చెప్పాలని ఆమెతో బూట్లు, చెప్పులు నాకించారు. ఎంత…
పాకిస్థాన్లో భారీలు పేలుడు సంభవించింది.. లాహోర్‌లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి దగ్గర జరిగిన భారీ బాంబు పేలుడులో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.. బాంబు పేలుడుపై మీడియాతో మాట్లాడిన లాహోర్ పోలీసులు.. ముగ్గురు మరణించినట్టు వెల్లడించారు.. ఇక, ప్రమాదం జరిగిన…