Pakistan Says Looking Into Case Of Indian Woman Allegations On Pakistan Embassy: వీసా కోసం భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి వెళ్లిన తనపై అక్కడి సీనియర్ అధికారులు లైంగిక వేధింపులకు గురిచేశారని ఇటీవల ఒక మహిళా ప్రొఫెసర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారంపై తాజాగా పాకిస్తాన్ స్పందించింది. తమ దౌత్య కార్యాలయాలను సందర్శించే వ్యక్తులపై అమర్యాదరకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తే.. వారిని ఉపేక్షించేందిలేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మాట్లాడుతూ.. వీసా, కాన్సులర్ దరఖాస్తుదారుల పట్ల సభ్యతగా వ్యవహరిస్తూ దౌత్య సిబ్బంది ప్రొఫెషనల్‌గా తమ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం తాము ఈ కేసుని పరిశీలిస్తున్నామని, కాకపోతే ఈ కేసుని లేవనెత్తిన విధానం తమని ఆశ్చర్యానికి గురి చేసిందని ముంతాజ్ తెలిపారు. ఈరోజుల్లో ప్రజల ఫిర్యాదులు తీసుకోవడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయన్నారు. తాము పాకిస్తాన్ వీసా దరఖాస్తుదారులకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని.. వృత్తిపరంగా సరైన ప్రవర్తిన కలిగి ఉండాలని పాక్ దౌత్య సిబ్బందికి కఠిన మార్గదర్శకాలు ఉన్నాయని వెల్లడించారు.
Air India Urination Case: మూత్ర విసర్జన కేసులో ఊహించని కోణం.. ట్విస్ట్ ఇచ్చిన మిశ్రా
కాగా.. పంజాబ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఒక మహిళ, పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వెళ్లేందుకు 2021లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. వీసా ఇంటర్వ్యూల సమయంలో ఒక పాకిస్తాన్ అధికారి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. దీనిపై తాను పాకిస్తాన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోలేదన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రికి కూడా లేఖ రాశార్నారు. లాహోర్‌లోని ఓ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వాల్సి ఉందని, అక్కడి కట్టడాల గురించి రాయదలుచుకున్నానని ఎంబసీ అధికారులకు తాను తెలిపానని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే.. అక్కడి నుంచి వెళుతున్న సమయంలో ఒక అధికారి తన వద్దకు వచ్చి వ్యక్తిగత ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎందుకు పెళ్లి చేసుకోలేదని, లైంగిక వాంఛలు ఎలా తీర్చుకుంటున్నారంటూ తన ప్రశ్నలతో ఆయన వేధించాడని ఆ ప్రొఫెసర్ చెప్పుకొచ్చాడు.
Big Breaking: ‘లైగర్’ తరువాత కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ