Kurasala Kannababu: మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు.. కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిసిశారు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, మేరుగు నాగార్జున.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాల్లో మేం ఉన్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని…
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.. వైసీపీ మేయర్‌పై అవిశ్వాస పరీక్షలో ఓటమిపాలయ్యారు.. అయితే, మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు.. కానీ, విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్... విశాఖ మేయర్ ఎన్నికల్లో పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారని.. ధర్మం, న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదని దుయ్యబట్టారు.. అయితే విప్ ఉల్లంఘించిన…
ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, సీఎం చంద్రబాబులా మోసం చేయడం చేతకాదని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదని.. సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారని విమర్శించారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందన్నారు. నారా లోకేష్ చేసింది యువగళం కాదని.. నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వ సాధారణం…
ఆ మాజీ మంత్రి పక్క జిల్లాలో సీటు పై ఫోకస్ చేశారా ? ఇప్పటి నుంచే అక్కడకి షిఫ్ట్ అయిపోతానని అధినేత ముందు రిక్వెస్ట్ పెట్టారా? ఆశించిన స్థాయిలో రెస్పాండ్ రాకపోవడంతో వేరే లెక్క వేస్తున్నారా? తాను రెండుసార్లు గెలిచిన నియోజకవర్గంలో అంత ఇంట్రెస్ట్ లేదా ? కురసాల కన్నబాబు…జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యంలో చేరి… 2009లో కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ…
రాష్ట్రంలో వరదలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సరిగా సాయం అందటం లేదని ఆరోపించారు. వరద వచ్చే ముందు, వచ్చిన తర్వాత బాధితులను పునరావాస కేంద్రాలను తరలించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సినిమాటిక్ యాత్ర లా పవన్ హావ భావాలు ఉన్నాయన్నారు.. అభిమానులను అలరించడానికి ఈ యాత్ర చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలన సౌలభ్యం ఉండాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని, జిల్లాల విభజన స్వాగతించాల్సిన అంశం అన్నారు.జిల్లాల విభజన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. పరిపాలన సౌలభ్యం పెరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రజలకు పరిపాలన చేరువ అయ్యేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాంలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. దానిలో…
ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఏపీలో కురిసిన భారీ వర్షాలపై మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయని, చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందన్నారు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు వరదల్లో 34 మంది మృతి చెందారని, 10 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. మృతి చెందిన…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. ఆరోజు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రోజు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. జడ్పీ లో ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా వైఎస్సార్సీపీ అవడం మాకెంతో ఘనత. వచ్చే పంట రబికి గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటం కారణంగా ఆయకట్ట తగ్గుతుందని రైతుల్లో చర్చ జరుగుతుంది.…