IPL 2026: ఐపీఎల్ (IPL) తొలి ఛాంపియన్స్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు తాజాగా కీలక ప్రకటన చేసింది. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరను తమ జట్టుకు హెడ్ కోచ్‌గా తిరిగి నియమించినట్లు ప్రకటించింది. గతంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు.. సంగక్కర రాయల్స్ ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ పదవిలో కొనసాగారు. అలాగే సంగక్కర గతంలో 2021 నుంచి 2024 వరకు రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశారు. ఇప్పుడు…
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సిడ్నీలో మెరిశాడు. పెర్త్, అడిలైడ్‌లో డకౌట్ అయిన కోహ్లీ.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో హాఫ్ సెంచరీతో అలరించాడు. 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ హాఫ్ సెంచరీతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. కింగ్ నెలకొల్పిన ఆ రికార్డ్స్ ఏంటో చూద్దాం. వన్డే చరిత్రలో లక్ష…
మార్చి 18 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. టీమిండియాకు ఈరోజు చాలా చిరస్మరణీయమైనది. మార్చి 18.. ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు తమ చివరి వన్డే మ్యాచ్ ఆడారు. వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర, మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నారు.
Joe Root Overtakes Kumar Sangakkara in Tests: టెస్ట్ క్రికెట్‌లో వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను అధిగమించాడు.…
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు భారత్ ప్లేయింగ్-11లో ఏ ఆటగాళ్లకు అవకాశం ఇస్తారనే చర్చ తారాస్థాయికి చేరుకుంది. రోహిత్ శర్మతో ఎవరు ఓపెనింగ్ చేస్తారు.. ఏ స్పిన్నర్లకు అవకాశం లభిస్తుందనే దానిపై చాలా మంది అనుభవజ్ఞులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా వికెట్ కీపింగ్ పై ఎక్కువగా చర్చ జరుగుతోంది.
Kumar Sangakkara React on Sanju Samson’s Controversial Dismissal: సంజూ శాంసన్ ఔట్ అవ్వడం వలనే తాము మ్యాచ్ ఓడిపోయామని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర అన్నాడు. మ్యాచ్ చాలా కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం రావడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. ఏదేమైనా క్రికెట్ ఆటలో అంపైర్ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడాల్సి ఉంటుందని సంగక్కర పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో…
శ్రీలంకలో ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడ గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వేలాది నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. పరిస్థితులు విషమించాయనే ఇంటలిజెన్స్ నివేదికలతో అధ్యక్షుడు దేశం వదిలి పారిపోయాడని సమాచారం. శనివారం అధ్యక్ష భవనానికి భారీ భద్రత ఉన్నా బారికేడ్లు, టియర్ గ్యాస్ తో ఆందోళనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేసినా.. అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. అధ్యక్ష భవనంతో పాటు ఆయన సెక్రటేరియట్ వద్ద ప్రజలు వేలాదిగా శ్రీలంక జెండాను పట్టుకుని గుమిగూడారు. అయతే…