హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద కాల్పులకు తెగబడ్డారు దుండగులు… ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జరిపిన ఆగంతకులు… సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి.. అందినకాడికి డబ్బును దోసుకెళ్లారు.. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.. ఏటీఎంలో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జరిపారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.. కాల్పుల్లో గాయపడిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దోపిడీకి పాల్పడిన ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. అదికూడా రద్దీగా ఉండే కూకట్‌పల్లి ఏరియాలో.. పట్టపగలే ఈ దోపిడీకి పాల్పడ్డారంటే.. వాళ్లు పక్కా స్కెచ్ వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా.. కాల్పులు జరిపి.. భారీగా నగదును దోచుకెళ్లడం.. కలకలం సృష్టిస్తోంది..