హైదరాబాద్ కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌లోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇంటి కిటికీలు, తలుపులు, ఇతర విలువైన సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఫ్రిజ్ నుంచి కంప్రెసర్ గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు…
కూకట్‌పల్లిలోని శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రి సమయం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. థియేటర్‌లోని సామాగ్రి మొత్తం అగ్నికి అహుతి అయింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్థరాత్రి…
ఇళ్లలోని ల్యాప్‌టాప్‌లను దొంగిలించే ఓ ముఠాను కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డికి చెందిన పాటిల్ శివాజీ (23), బోయిన వెంకటేశం (21), అజ్జంపల్లి గోవర్థన్ రెడ్డి (23) ముగ్గు రు స్నేహితులు . వీరిలో వెంకటేశం, గోవర్థన్‌రెడ్డికి కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండలో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. వీరితో శివాజీ కలిశాడు. వీరు ముగ్గురు కలిసిన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పగటి వేళ్లలో పుడ్ డెలివరీ బాయ్స్‌గా వెళ్లి…
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.. సహజీవనం వద్దు అన్నందుకు ఒక వ్యక్తి, మహిళపై కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లికి చెందిన వెంకటలక్ష్మి(50) నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కాంటాక్ట్ స్వీపర్ గా పనిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందడంతో కొడుకు, కూతురితో నివసిస్తోంది.ఇక ఈ నేపథ్యంలోనే ఆమెకు జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో ఉండే వెంకటేష్(55)తో పరిచయం ఏర్పడింది. అతడికి భార్య చనిపోవడంతో వీరి అండీ స్నేహం.. వివాహేతేర…
జూబ్లీహిల్స్ స్పాయిల్ పబ్ లో దారుణం చోటు చేసుకోంది. యువతిని మాట్లాడదామని పిలిచి ఆమెపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. కూకట్ పల్లి కి చెందిన బిజిన్ అనే యువకుడు.. ఒక బ్యూటిషన్ తో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నాడు. ఇటీవల వీరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరు విడిగా ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ నెల 11 న…
హైదరాబాద్ నడిబొడ్డున యువత రెచ్చిపోయారు. మందు, విందు, యువతులతో కలిసి చిందేశారు. రచ్చరంబోలా చేశారు. దీంతో సమాచారం అందుకున్న స్సెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు షాకయ్యారు. రేవ్ పార్టీ పేరుతో యువత చిందులేశారు. ఈ సందర్భందా 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. పెద్ద మొత్తంలో…
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా నిత్యావసరాలైన కూరగాయలు, మాంసాహారం, చేపలు ఒకే చోట దొరికే విధంగా అన్ని వసతులతో కూడిన మోడల్ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందు బాటు లోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో రోడ్లపై అమ్మడం వలన ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. తద్వారా రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని నగరంలో…
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నగరంలో ఎక్కడో ఒక చోట వ్యభిచార దండాలు నడుస్తూనే ఉన్నాయి. అమాయకులైన ఆడపిల్లలకు డబ్బు ఆశచూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. తాజాగా కూకట్ పల్లిలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే హైదరాబాద్ కేపీహెచ్‌బీకాలనీలోని రోడ్డు నెంబర్ 4 లో గల ఒక ఇంటిని బి.రాజు, నూర్‌పాషా కాసింబీ అనే ఇద్దురు వ్యక్తులు అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజుల…
గ్రేటర్లో ఆ మేడమ్ స్పెషల్. మాములు స్పెషల్ కాదు.. వేరీ వేరీ స్పెషల్. బదిలీ అయినా.. గంటల్లోనే ఆ ఉత్తర్వులను మార్పించుకోగల ‘పవర్’ ఉందని నిరూపించారు. మరోసారి ఉద్యోగవర్గాల్లో చర్చగా మారారు ఆ అధికారి. ఉన్నచోటు నుంచి సీటు కదలకుండా పావులు కదిపిన ఆ మేడమ్ ఎవరు? బదిలీ ఆగడానికి .. టీజీవో ప్రెసిడెంట్ పోస్టా? ఇంకేదైనా ఉందా? వి. మమత. GHMCలో జోనల్ కమిషనర్. ఈ హోదా కంటే.. ఉద్యోగవర్గాల్లో మమత మరోరకంగా పాపులర్. తెలంగాణ…
ఏపీ మీదుగా తెలంగాణకు వస్తున్న గంజాయి అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై గంజాయి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. చిట్యాల వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాలీలో 100 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా దానిని సీజ్ చేశారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏవోబీ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు గంజాయి రవాణా చేస్తోంది ముఠా. ఎస్పీ…