కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ వడ్డెర బస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ జోన్ డిసిపి శిల్పవల్లి అధ్వర్యంలో 232 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. తనిఖీలతో పాటు ఇంటింటికి తిరుగుతూ కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన కల్పించారు.
కార్డాన్ సెర్చ్ అనంతరం డిసిపి మాట్లాడుతూ.. సరైన ధృవపత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసారు. 11 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఓ పాన్ షాప్, కిరాణా షాపుల నిర్వాహకులు పై కేసు నమోదు చేశామని, అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు, మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆమె తెలియజేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో గత మాసం మే 31న పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో 140 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఏడు మంది సిఐలు 14 మంది ఎస్ఐలు 20 మంది ఏ ఎస్ ఐ లు, హెడ్ కానిస్టేబుల్, 100 మంది కానిస్టేబుళ్లు తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 84 బైకులు, 37 ఆటోలు సీజ్ చేసిన విషయం తెలిసిందే.