చరిత్ర చదవకుండా భవిష్యత్‌ను నిర్మించలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ భవన్లో దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఆత్మగౌరవం.. అస్తిత్వం.. ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లమవుతామన్నారు.
తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొలుపుతున్నారని అన్నారు. కేటీఆర్‌కు పార్టీని ఎవరు ఏం చేస్తారో అని.. గతంలో చేసిన తప్పులకు ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందో అని రెండు భయాలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే జైలుకు పోతానంటున్నారని కడియం శ్రీహరి చెప్పారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై సిరిసిల్ల శాసనసభ్యులు కె.తారక రామారావు చేసిన అవమానకరమైన, నిరాధార ఆరోపణలను.. దుర్భాషలాడటాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
BRSV State Secretary: బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగిలో ప్రసాద్ ను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు. దిలావర్ పూర్-గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయని చెప్పారు.
ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలి.. ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలైంది. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26) అనే యువకుడు కొన్నేళ్లుగా ఈమె వెంటపడి ప్రేమపేరిట వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో విసుగు చెందిన యువతి…
కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదు.. తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాయుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను ప్రజలు చీదరించుకున్నారని అన్నారు. అబద్దపు ప్రచారం చేసిన రాహుల్ గాంధీ కాంగ్రెస్…
BRS KTR: పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారని బీఆర్ఎస్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కలిసి పరామర్శించారు.