Yennam Srinivas Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని టచ్ చేసే అవకాశం కూడా తెలంగాణ ప్రజలు కేటీఆర్ కు ఇవ్వరని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేటీఆర్ మళ్ళీ అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెచ్చి గాంధీ భవన్ లో పెడుతారట, అంటూ మండిపడ్డారు. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తా అనటం మీ అవివేకం అన్నారు. తెలంగాణా తల్లి విగ్రహం చట్ట సభలో ఆమోదించాకే ఆవిష్కరణ జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఎవ్వరు విగ్రహం టచ్ చేయాలనీ చూసిన మాడి మసై పోతారు జాగ్రత్త అని హెచ్చరించారు.
Read also: RGV Case : రామ్‌గోపాల్‌వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు
కవులను, కళాకారులను గుర్తించాలని ప్రభుత్వం భావించి, వాళ్లకు సన్మానం చేస్తే కూడా ఎమ్మెల్సీ కవిత తప్పు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారానికి అడ్డు వస్తారని ఐదేండ్లు మహిళా మంత్రిని కూడా చేయని మీరు.. మహిళల గురించి మాట్లాడుతున్నారా…? అని ప్రశ్నించారు. కేటీఆర్, కవితకు సూటి ప్రశ్న.. మీరు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ భవన్‌లో రూపొంద లేదా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తామంటున్నారని అన్నారు. పది ఏండ్లు అధికారంలో ఉండి ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు? అని మండిపడ్డారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
కేటీఆర్, కవిత లు అమెరికా నుండి వచ్చినప్పుడు ఆస్తి ఎంత? ఇప్పుడు మీ ఆస్తి ఎంతో చెప్పాలని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం చాకలి ఐలమ్మ ప్రతి రూపమేనని సంబండ వర్గాలు అభిప్రాయ పడుతున్నారని అన్నారు. గద్దర్, గూడ అంజన్న, విమలక్క, అశోక్ తేజ, జయరాజ్, లను మీరు ఎందుకు గుర్తించలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరేటి వెంకన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినా సరే కవిగా ఆయనను సన్మానించామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమ కారులకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు.
Lagacharla Case: నరేందర్‌రెడ్డి, సురేష్ సహకరించట్లేదు.. కస్టడీని మరో రెండు రోజులు పొడిగించండి..