KTR: ఆశా వర్కర్లపై నిన్న ఎవరైతే దాడి చేసిన పోలీసులు ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్ నిన్న ఆశ వర్కర్ల ఆందోళనలో గాయపడ్డ వారిని పరామర్శించారు. కేటీఆర్ తో పాటు ఎంఎల్ఏ లు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం అని చెప్పి.. కాంగ్రెస్ పార్టీ పాలన ఏడాది పూర్తి చేసుకుందని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన ఆశాలు ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. నిన్న ఆడబిడ్డలపై దమనకాండ అందరూ ఖండించారని కేటీఆర్ తెలిపారు.
Read also: MLA Beerla Ilaiah: ఆర్టీసీ బస్సులో డాన్స్ చేయమన్న కేటీఆర్.. మహిళల గురించి మాటలా..
మగ పోలీసులు ఆడవాళ్ళని దుశ్శాసన పర్వం చూసామన్నారు. ఇదేనా హోం శాఖ తీరు అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చాక ఆశా వర్కర్లకు రూ.18వేల రూపాయలు చేస్తామని మాట ఇచ్చింది. మీరు ఇచ్చిన మాటనే కదా అన్నారు. మీ దగ్గరికి వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే.. మీరు చేపట్టిన దమనకాండ రాష్ట్రమంతా చూసిందన్నారు. రహీమ్ బీ.. సంతోష అనే ఆశావర్కర్లపై ఇష్టం వచ్చినట్టు భౌతికంగా దాడి చేశారన్నారు. పోలీసులు ఇంత నీఛంగా ప్రవర్తించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. మేము మానవ హక్కుల కోసం పొరాడుతామన్నారు. మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్ నీ కలుస్తామన్నారు.
ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో వున్న వారికి వైద్యం సరిగ్గా అందకపోతే మేము ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తామని తెలిపారు. ఆశావర్కర్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. నిన్న ఎవరైతే దాడి చేసిన పోలీసులు ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది మంచి వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. గతంలో వారికి రూ.1700 జీతం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.9.750 రూపాయలకు పెంచామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ రూ.18 వేలకు పెంచుతాం అని, మరి దాన్ని నెరవేర్చాలని వారు అడిగారని కేటీఆర్ స్పష్టం చేశారు.
Yennam Srinivas Reddy: అయ్యా కేటీఆర్.. విగ్రహాన్ని టచ్ చేసే అవకాశం ఇవ్వరు.. ఎమ్మెల్యే ఫైర్