ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలి.. ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలైంది. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26) అనే యువకుడు కొన్నేళ్లుగా ఈమె వెంటపడి ప్రేమపేరిట వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో విసుగు చెందిన యువతి…
కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదు.. తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాయుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను ప్రజలు చీదరించుకున్నారని అన్నారు. అబద్దపు ప్రచారం చేసిన రాహుల్ గాంధీ కాంగ్రెస్…
BRS KTR: పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారని బీఆర్ఎస్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కలిసి పరామర్శించారు.
KTR : ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుందన్నారు కేటీఆర్. 2009, నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి…
BRS Maha Dharna: మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ కూడా ధర్నాను వాయిదా వేసింది.
బీఆర్ఎస్ హయాంలో మహబూబాబాద్‌లో గిరిజనుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్‌కు రావాలని ఎంపీ బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రతో చేయించిందని.. అందులో ఏడుగురికి భూములు లేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు.
వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. కేసీఆర్ గడీలను కూల్చేందుకే పాదయాత్ర చేశానని తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించింది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా ఆనాడు మాట ఇచ్చారు.. కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Mallu Ravi : కాంగ్రెస్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్ ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గిరిజనుల కోసం పదేళ్ల పాలనలో ఏమి చేశారని ప్రశ్నించారు. లగచర్లలో ప్రజలు, రైతులను రెచ్చగొట్టింది కేటీఆర్ కాదా? అని ఆరోపించారు. గొడవలకు కారణం కేటీఆర్ అని తేలడంతో, నూతన డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్…
హన్మకొండ ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఉక్కు మహిళ అని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ఉక్కు సంకల్పంతో ఉన్నామని, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యానని ఆయన అన్నారు.