Jagga Reddy: మంచి పనిని చెడ్డ పనిలా చూపించడంలోనే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ బిజీ ఉన్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మల్లన్న సాగర్లో రైతులను కొట్టి భూములు లాక్కున్నారు.
Kishan Reddy: కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Harish Rao: రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bhatti Vikramarka: పరిశ్రమలు పెట్టాలని చేసేది ప్రభుత్వ వైఫల్యమా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అయితే.. ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రఘురామతో పాటు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్…
BRS KTR: ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, కేటీఆర్ సిరిసిల్ల నేతన్న ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా అక్కడికి చేరుకోగానే కేటీఆర్ 'X'లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
కేసీఆర్, కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులు, మిత్తిలు కట్టడం ఇబ్బందిగా ఉందన్నారు. రైతు కళ్లలో ఆనందం చూసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వ్యాఖ్యలు నమ్మే విధంగా లేవని మంత్రి పొంగులేటి తెలిపారు.
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కుల గణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.