MLA Beerla Ilaiah: కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్‌లో డాన్స్ చేయమన్న కేటీఆర్ మహిళల గురించి మాట్లాడారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని కేటీఆర్ అంటున్నారు సిగ్గుండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. పేదోళ్ల తల్లి, కవుల కళాకారులకు ప్రతీక, మేధావుల ఆలోచనల మేరకే తెలంగాణ తల్లి విగ్రహం అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడితే కేటీఆర్, హరీష్ రావు.. నాలుక తెలంగాణ ప్రజలు కోస్తారు జాగ్రత్త అన్నారు.
Read also: Zelensky: నేనంటే రష్యా అధ్యక్షుడికి భయం.. తర్వలోనే యుద్ధం ముగుస్తుంది!
నిన్న తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన శుభ దినం అన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ పుట్టిన రోజును నిన్న ఘనంగా జరుపుకున్నామన్నారు. తెలంగాణ సిద్దించి పదేండ్లు అయినా ఏ ఒక్కరోజు తెలంగాణ తల్లిని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు కేటీఆర్ అని ప్రశ్నించారు. కవిత మహిళల గురించి మాట్లాడుతుంది.. మహిళ గవర్నర్‌ను దూషించిన ఘనత మీ నాయకుని ది అన్నారు. ఆర్టీసీ బస్‌లో డాన్స్ చేయమన్న మీ అన్న (కేటీఆర్) మహిళల గురించి మాట్లాడారని గుర్తుచేశారు. కవులు, మేధావులతో చర్చించి నిన్న సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానిస్తే రాలేదని తెలిపారు.
Read also: Vizag Honey Trap Case: జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్..
2007లో ఆలేరు నియోజక వర్గం బేగంపేటలో తెలంగాణ తల్లి విగ్రహ నమూనా తయారు అయిందన్నారు. ఆ నమూనాతోనే ఉన్న విగ్రహాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. తెలంగాణ తల్లిని చూస్తే చాకలి, ఐలమ్మ, ఉద్యమ కారులు, పేదోళ్ల గుర్తుకు వస్తారన్నారు. గడిల తల్లి కాదు గరీబోళ్ల తల్లి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నారని తెలిపారు. ఏనాడు తెలంగాణ తల్లి గురించి, సెంటిమెంట్ గుర్తించని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఆరాచకాన్ని, దొరల పాలనను తెలంగాణ ప్రజలు సహించరని తెలిపారు. అందుకే మిమ్ముల్ని తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చొబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
Mahayuti Cabinet Expansion: డిసెంబర్ 14న మహాయుతి మంత్రివర్గ విస్తరణ.. కొత్తవారికి ఛాన్స్!