హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. బీజేపీ హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ ని బీజేపీ ఎందుకు టార్గెట్ చేసింది. అసలు బీజేపీ నాయకత్వం ఏం చేయబోతోంది? తెలంగాణలో బీజేపీ పటిష్టానికి ఏం ఆలోచిస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి ఎలా రాబోతోంది. అసలు కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ ని ఎందుకు వేదికగా మార్చారు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలు ప్రస్తావించారు.
కేసీఆర్ పాలనలో ఏ వర్గం బతుకులు మారలేదన్నారు బండి సంజయ్. ప్రజలకు భరోసా కల్పించాలని, ప్రజల్లో ధైర్యం కలిగించడానికి మోడీ వస్తున్నారు. తెలంగాణలో అందరికీ రైతు బంధు లభించడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఎందుకివ్వడం లేదన్నారు. నిరుద్యోగ సమస్య, రైతుల ఇబ్బందులపై పోరాటం చేస్తే లాఠీఛార్జి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. తెలంగాణలో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై బీజేపీ పోరాటాలు చేస్తోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు బండి సంజయ్.
తెలంగాణ ధనిక రాష్ట్రం.. కేసీఆర్ పాలనలో జీతాలివ్వలేని విధంగా తయారైంది. ఎవరికీ భరోసా లభించడం లేదన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అమలు కావడం లేదు. కేంద్రం ఇచ్చే నిధుల్ని పేర్లు మారుస్తున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన కింద బియ్యం పేదలకు అందిస్తున్నాం. కేంద్రం పథకాలను సరిగా అమలు చేయడం లేదు. దళిత ముఖ్యమంత్రి చేస్తామని మేం చెప్పలేదు. కేసీఆర్ ప్రకటించి కూడా అమలు చేయలేదు. దళిత నేతను దేశ ప్రథమ పౌరురాలిగా చేయబోతున్నాం. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పేద ప్రజల బతుకులు మారలేదు. అప్పుడు ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పీవీ నరసింహారావుని పట్టించుకోవడం లేదు. గతంలో పీవీ ఠీవీ అన్నారు జీహెచ్ ఎంసీ ఎన్నికలలో హడావిడి చేశారు. కానీ పట్టించుకోవడం లేదు. ఏమతం వారు ఆ మతాన్ని పాటించాలన్నాను. మసీదులు తవ్వమని నేను ఎప్పుడూ అనలేదు. 15 నిముషాలు టైం ఇవ్వమన్న వ్యక్తిని ఏం చేయలేదు. తెలంగాణలో ప్రతి ఇంటిని తనిఖీ చేస్తామన్నారు. తెలంగాణలో అధికారం ఇస్తే అన్నీ చేస్తాం. భాగ్యలక్ష్మి అమ్మవారిని నిందించారు. మీరేం చేశారు. మతాన్ని కొమ్ముకాసేవారు సెక్యులర్. హిందూత్వం గురించి మాట్లాడితే మతోన్మాదం. మసీదులను రాజకీయాల కోసం కించపరుచుకోవద్దన్నారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచే నేను పర్మిషన్ లేకుండానే పాదయాత్ర చేశా. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు అనుకూలంగా ఎంఐఎం పనిచేస్తోంది. ఓల్డ్ సిటీ హైటెక్ సిటీ ఎందుకు కావడం లేదన్నారు. మార్చే అవకాశం ఇవ్వాలన్నారు బండి సంజయ్.
కొంతమంది కుహనా శక్తులు నా వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారన్నారు. బండి సంజయ్ కి ఎలాంటి ఇబ్బందులు లేవు. పాత బ్యాచ్, కొత్త బ్యాచ్ అంటూ ఏదీలేదన్నారు. ఒంటెత్తు పోకడలు లేవు. నేను మోడీ వర్గం మాత్రమే. కిషన్ రెడ్డి నన్నేం వ్యతిరేకించడం లేదు. ఈ సమావేశాలకు అంతా ఇష్టంగా వస్తున్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు పోతున్నాం. బీజేపీ ఏ రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. ఎంపీగా చేయమంటే, ఎమ్మెల్యేగా చేయమంటే చేస్తా. నేను సీఎం కావాలని పనిచేయడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారం కోసం ప్రయత్నిస్తున్నాం. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని సమాధి చేయాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం ముందుకెళతాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని అర్హతలు వున్నాయి. దేశంలో 2 సీట్ల నుంచి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చాం. దేశాన్ని బీజేపీ నడిపిస్తోందన్నారు బండి సంజయ్.
తెలంగాణలో తమ పోరాటం టీఆర్ఎస్ తోనే అన్నారు బండి సంజయ్. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పోరాటం చేయలేదు. తెలంగాణ వ్యతిరేక శక్తులు బీజేపీ వైపు వున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాల అనంతరం తెలంగాణ ప్రజలకు భరోసా కల్పిస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వండి. నీతిమంతమయిన పాలన అందిస్తాం. ఈసారి 70 కంటే ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తాయన్నారు.