టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈమధ్యకాలంలో సినిమాల దూకుడు పెంచాడు. మొన్ననే ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాలతో పర్వాలేదనిపించిన నితిన్.. తన తదుపరి చిత్రం ‘మాస్ట్రో’ సెప్టెంబరు 17 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా, నితిన్ తన కెరీర్ లో 31వ చిత్రాన్ని నేడు వినాయకచవితి సందర్బంగా పూజ కార్యక్రమాలతో ఘనంగా…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, ఉగాది పండుగలను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనం పండగను జరుపుకుంటారు. కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఓనం పండగ ఒకటి.. ఈ పండగను మళయాళీలందరూ భక్తి శ్రద్దలతో, కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు.ఈ పండగను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పది రోజులు అనేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో పాటు వివిధ సాహస కార్యక్రమాలు చేపడతారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించే తీరు…
ఎట్టకేలకు కింగ్ నాగార్జున “బంగార్రాజు” పట్టాలెక్కింది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన” ప్రీక్వెల్ ను ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగ్ బంగార్రాజు పాత్రకు సూపర్ క్రేజ్ లభించింది. అప్పట్టోనే దానికి ప్రీక్వెల్గా ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా తీస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా…
నేచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “శ్యామ్ సింగ రాయ్” చిత్రానికి మేకర్స్ గుమ్మడికాయ కొట్టేశారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం కోల్కతా నేపథ్యంలో సెట్ చేయబడింది. నాని బెంగాలీ లుక్ ఉన్న ఫస్ట్ లుక్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. కోవిడ్-19 కారణంగా చిత్రం చివరి షెడ్యూల్ వాయిదా పడింది. లేదంటే సినిమా చిత్రీకరణ ఒక నెల క్రితమే పూర్తయ్యేది.…
పెట్రోలు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. నిజానికి లీటర్ పెట్రోల్ ధర పైసలు, రూపాయల్లో పెరుగుతోంది. కానీ మన టాలీవుడ్ అందాల భామలు కొందరు తమ పారితోషికాన్ని సినిమా సినిమాకూ లక్షల్లో పెంచేస్తున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’కు ఎంత ఇస్తే అంతే తీసుకున్న కృతీశెట్టి…. ఆ సినిమా సూపర్ హిట్ కావడం, అందులో తన నటనకు మంచి మార్కులు పడటంతో తన రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేసింది. అయితే ఆమె తొలి చిత్రం విడుదల…
నేడు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన నటుడిగానూ కొన్ని చిత్రాలలో నటించి మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. దాంతో భారతీరాజా బర్త్ డే వేడుకలను రామ్ సినిమా షూటింగ్ సెట్ లో జరిపారు దర్శకుడు లింగుస్వామి. ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రామ్ సినిమా షూటింగ్ స్పాట్ కు ప్రతిరోజూ ఎవరో ఒక అతిథి వస్తూనే ఉన్నారు. ఆ మధ్య ప్రముఖ దర్శకుడు శంకర్ రాగా, ఇవాళ భారతీరాజా విచ్చేశారు. ఈ…
రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చడంతో పాటు అభినందించి వెళ్ళారు. హైదరాబాద్, వైజాగ్ లో ఈ సినిమా షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాస్ చిట్టూరి. చిత్రం ఏమంటే… రామ్ తో ఈ మూవీలో ఎవరు ఢీ కొట్టబోతున్నారనే విషయంలో ఇంతవరకూ…
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. బుధవారం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్ ను ప్రముఖ దర్శకుడు శంకర్ సందర్శించారు. రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నదియా కీలక పాత్రను పోషిస్తున్నారు. సెట్ కి వచ్చిన శంకర్ హీరో రామ్, దర్శకుడు లింగు స్వామితో పాటు యూనిట్ మెంబర్స్ తో సంభాషించారు. ఈ విషయమై శంకర్ కి…
“ఉప్పెన” బ్యూటీ కృతి శెట్టికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. “ఉప్పెన” చిత్రం విడుదలయ్యాక అందరూ ఈ బేబమ్మ నామజపమే చేశారు. ఇక ఆ క్రేజ్ తో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆఫర్లతో ఆమె ఇంటి తలుపు తడుతున్నారు. ఇంకేముంది ఇప్పుడు కృతి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా… త్వరలో తెరకెక్కనున్న కింగ్ నాగార్జున క్రేజీ ప్రాజెక్ట్…
‘ఉస్తాద్’ రామ్ పోతినేని, లింగుసామి కాంబినేషన్లో శ్రీనివాస్ చిట్టూరి తీస్తున్న ద్విభాషా చిత్రం రెగ్యులర్ షూటింగ్ 12 నుంచి ఆరంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఊర మాస్ సినిమాగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై తెరకెక్కనుంది. రామ్ తొలి బైలింగ్వల్ సినిమా ఇది. ‘రన్’, ‘ఆవారా’, ‘పందెంకోడి’ వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన లింగుసామి తీస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీశెట్టి హీరోయిన్గా నటించనుంది. ‘దృశ్యం’,…