నాగలక్ష్మిగా కృతి శెట్టి… ‘బంగార్రాజు’ నుంచి ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ అక్కినేని అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి కృతిశెట్టి ఫస్ట్‌లుక్ ను హీరో నాగచైతన్య ఆవిష్కరించారు.
Read Also : రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
కృతి శెట్టి లుక్ పై స్పందిస్తూ ‘బాగుంది. “బంగార్రాజు” లుక్ ఏది? అంటూ నాగార్జున అడిగిన ప్రశ్నకు సమాధానంగా చై ‘లేడీస్ ఫస్ట్’ అంటూ చమత్కరించారు. “కృతి శెట్టిని మా నాగలక్ష్మిగా పరిచయం చేస్తున్నా.. ఫస్ట్ లుక్ ఇదిగో’’ అని నాగ చైతన్య ట్వీట్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కృతి ఆకుపచ్చ చీర కట్టుకుని అందంగా కనిపిస్తోంది. ఆమె ఎడమచేతిలో నల్లటి షేడ్స్ పట్టుకుని అదే చేతిని ఊపుతోంది. ఆమె మెడలో ఒక దండ ఉండడం ఆసక్తికరంగా ఉంది. ఈ లుక్ చూస్తుంటే ఆమె రాజకీయ నాయకురాలిగా కన్పిస్తోంది. ‘బంగార్రాజు’లో తన లుక్ పై కృతి శెట్టి స్పందిస్తూ “పరిచయం చేసినందుకు ధన్యవాదాలు నాగ చైతన్య. నాగ లక్ష్మి కావడం నాకు చాలా ఆనందంగా ఉంది !!!” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
#Bangarraju is coming soon …ladies first 🙂 introducing @IamKrithiShetty as our Nagalakshmi .. Here’s the first look @iamnagarjuna @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @ZeeStudios_ pic.twitter.com/13hsyH0ff4
— chaitanya akkineni (@chay_akkineni) November 18, 2021
తాజావార్తలు
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?