పాఠశాల చదివే సమయంలో ప్రతి తరగతి వార్షిక పరీక్షల్లో పాస్ అయ్యి తర్వాత తరగతికి వెళ్లడం పరిపాటి. అయితే పదో తరగతి వార్షిక పరీక్షలు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో చేరడం మరో విశేషం. అప్పటివరకు కేవలం పరీక్షలన్నీ చదువుతున్న పాఠశాలలో తన స్నేహితుల మధ్య పరీక్షలు రాసి పాస్ అవ్వడం నుండి వేరే పాఠశాలలో తెలియని విద్యార్థులతో పాటు పరీక్షలు పాస్ అవ్వడం అంత వేరు. అయితే ఇలాంటి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు కొందరు ఫెయిల్…
Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీపై నేడు కేంద్ర జల విద్యుత్ శాఖ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర జల విద్యుత్ శాఖ అధికారులు, తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య హైబ్రిడ్ విధానంలో సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ అధికారి దేవేంద్రకుమార్‌ను మచిలీపట్నం కలెక్టరెట్‌లోని తన ఛాంబర్‌లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.
Tollywood Veteran Actor Krishna Statue unveiled in Burripalem: బుర్రిపాలెం బుల్లోడు, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ నేడు ఘనంగా జరిగింది. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ కుటుంబ సభ్యులు.. సూపర్ స్టార్ సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణకు కృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. విజయవాడ నుంచి బుర్రిపాలెం వరకూ ఫాన్స్ ర్యాలీ నిర్వహించనున్నారు.…
రేపు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు… కృష్ణ గారు భౌతికంగా మరణించినా కూడా తాను నటించిన సినిమాల ద్వారా అభిమానుల హృదయాల్లో ఎప్పటికి జీవించి ఉన్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను కృష్ణ పుట్టినరోజున ప్రకటించడానికి ఆసక్తి చూపుతారనే విషయం తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ రేపు విడుదల కానున్నాయి.మహేష్ కోసం త్రివిక్రమ్ గుంటూరు కారం అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్…
Bengaluru: బెంగళూర్ లో అధికారం వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నగరం మొత్తం భారీ వర్షం తడిసిముద్దైంది. పలు ప్రాంతాల్లో అండర్ పాసుల కిందికి నీళ్లు చేరాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ వర్షం వల్ల ఆంధ్రప్రదేశ్ కు చెంది టెకీ భానురేఖ మరణించారు.
Bengaluru Rains: బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. ఇదిలా ఉంటే బెంగళూర్ వర్షానికి ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లాకు చెందిన భానురేఖ(22) అనే యువతి మరణించింది.
నరేశ్, పవిత్రలోకేష్, వనిత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన 'మళ్లీ పెళ్ళి' సినిమాలోని గీతం బుధవారం విడుదలైంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను నరేశ్ అయ్యర్ పాడగా, సురేశ్ బొబ్బిలి స్వరాలు అందించారు.
Shobhan Babu: నటరత్న యన్టీఆర్ అంటే నటభూషణ శోభన్ బాబుకు ఎంతో అభిమానం. శోభన్ ఇంట్లో యన్టీఆర్ అతిపెద్ద చిత్రపటం ఆయన ఆఫీస్ రూమ్ లో దర్శనమిస్తుంది. రామారావు అంటే శోభన్ కు అంత అభిమానానికి కారణం, యన్టీఆర్ 'దైవబలం'తోనే శోభన్ బాబు చిత్రసీమలో అడుగు పెట్టారు.