2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Shastri Dream Squad for 2027 ODI World Cup: 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే టీంఇండియా జట్టు ఏంటనే చర్చలు మొదలయ్యాయి. ఈ మధ్యనే ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ ఫార్మాట్‌ను ప్రకటించగా.. మాజీ భారత మాజీ ప్లేయర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా తన డ్రీమ్ టీమిండియా జట్టును ఎంపిక చేశాడు. అనుభవం, యువశక్తి కలయికతో ఉన్న 15 మంది సభ్యుల జట్టును ఆయన ప్రకటించాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో భారత్‌కు ఈ జట్టే మంచి పోటీ ఇస్తుందని అభిప్రాయపడ్డారు.
రో-కోపై నమ్మకం:
ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. 2027 ప్రపంచకప్‌లో వీరిద్దరూ తప్పకుండా జట్టులో ఉండాలని రవిశాస్త్రి స్పష్టం చేశారు. పెద్ద టోర్నీల్లో వీరి అనుభవం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు కూడా జట్టులో స్థానం కల్పించగా.. శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు.
Also Read
- రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
నలుగురు స్టార్ పేసర్లతో బౌలింగ్:
రవిశాస్త్రి ఎంపిక చేసిన జట్టులో ముఖ్యంగా చెప్పాల్సినది పేస్ బౌలింగ్ విభాగం. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా పిచ్‌లపై వీరి వేగం, బౌన్స్ ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాలుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం యువ బౌలర్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు కనపడుతున్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, గురునూర్ వంటి యువ పేసర్లను భవిష్యత్ జట్టులో తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు.
ఆల్రౌండర్లలో సమతుల్యత:
మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లను ఎంపిక చేసిన రవిశాస్త్రి.. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు చోటు ఇచ్చారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా ఉండగా.. అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజా అతడికి తోడుగా బరిలోకి దిగే అవకాశం ఉంటుందని అన్నారు.
రవిశాస్త్రి ఎంపిక చేసిన 2027 వన్డే వరల్డ్‌కప్ టీమిండియా జట్టు:
శుభ్‌మన్ గిల్ (C), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్.
🚨 Ravi Shastri Picks His India Squad for the 2027 ODI World Cup 🚨
1. Shubman Gill (C) 2. Rohit Sharma, 3. Virat Kohli 4. KL Rahul 5. Shreyas Iyer. 6. Hardik Pandya, 7. Axar Patel 8. Ravindra Jadeja 9. Jasprit Bumrah 10. Mohammed Siraj 11. Mohammed Shami 12.… pic.twitter.com/cbE4uIgDMr
— Central Cricket (@arshdeep3444) July 20, 2026
తాజావార్తలు
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?