Chennai LoveStory : ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ కాంబినేషన్లో తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’. SKN, సాయి రాజేష్ నిర్మిస్తుండగా రవి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం చుట్టూ రోజురోజుకూ బజ్ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రోమోలు, పాటలు ఇప్పటికే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకోగా, తాజాగా సెన్సార్ బోర్డ్ నుంచి లభించిన అద్భుతమైన పాజిటివ్ టాక్ మూవీ టీమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ నుండి క్లీన్ U సర్టిఫికెట్ అందుకున్న చెన్నై లవ్ స్టోరీ కిరణ్ కెరీర్ లో బెస్ట్ అని అవుతుందని యూనిట్ నమ్ముతోంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నిర్వహించనున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ రాకతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. సెన్సార్ బోర్డ్ సభ్యుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం, మెగాస్టార్ ఆశీస్సులు తోడవడంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో యూనిట్ ఉంది. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న థియేటర్లలో సందడి చేయనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి!
Also Read
తాజావార్తలు
-
Pan-India: ప్లాన్ చేస్తే పాన్ ఇండియా అవ్వదు: త్రివిక్రమ్
-
Gold Hunt: ఓ వైపు తుఫాన్.. మరోవైపు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..
-
Thaman: నాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చింది త్రివిక్రమ్
-
CM Chandrababu : ‘అర్నాబ్’ తుఫాన్ నష్టం రూ.4,563 కోట్లు.. రైతులకు రూ.6 వేల సాయం
-
Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..