Krishnakumar Balasubramanian is The Actor Who Played Lord Krishna: నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD గురువారం నాడు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ రివ్యూలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న మహాభారతానికి సంబంధించిన ప్రస్తావనలు, భవిష్యత్తుతో పురాణాల కలయికకు ప్రశంసల వర్షం కురుస్తోంది. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు మరియు అశ్వత్థామ మధ్య జరిగిన చివరి సంభాషణతో సినిమా ప్రారంభమవుతుంది. అమితాబ్ బచ్చన్ అశ్వథామ పాత్రలో నటించగా, కృష్ణుడి పాత్రలో నటించిన నటుడి ముఖాన్ని మాత్రం ఈసినిమా యూనిట్ రివీల్ చేయలేదు. శ్రీకృష్ణుడు వచ్చే సీన్లలో అతని మొహం కనపడదు.
Meera Nandan: గుడిలో ప్రియుడిని పెళ్లాడిన తెలుగు హీరోయిన్
ఐతే కల్కి 2898 ఏడీలో కృష్ణుడి పాత్రలో ఎవరు నటించారు అనే ప్రశ్న అందరి మదిలో మెదిలింది. ఈ సందర్భంలో కృష్ణుడి పాత్రలో ఎవరు నటించారు అనే విషయం వెల్లడైంది. అతను మరెవరో కాదు ప్రముఖ తమిళ నటుడు కృష్ణ కుమార్. 2010లో వలందనాగి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి సురారైపొట్టులో సూర్య స్నేహితుడిగా ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు ధనుష్‌తో కలిసి మారన్‌లో కూడా నటించనున్నాడు. ఈ పరిస్థితుల్లో. కల్కి 2898 AD వంటి భారీ నిర్మాణంలో కృష్ణుడి పాత్రను పోషించినందుకు ధన్యవాదాలు అని కృష్ణ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసారు. అలాగే తన పాత్రను పోషించిన అనుభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవని అన్నారు. కల్కి 2898 ADలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించారు. అదేవిధంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ తదితరులు అతిథి పాత్రల్లో నటించారు.