MLC Kavitha : తెలంగాణలో బీడుగా మారిన భూములకు కృష్ణా జలాలను మళ్లించే క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి సత్ఫలితాలను అందించిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కవిత తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. “కృష్ణా జలాల్లో మా వాటా మాకే” అనే కేసీఆర్ పోరాటం విజయవంతమై, దీని ఫలితాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై విచారణ జరపాల్సిందిగా గత పదేళ్లుగా కేసీఆర్ చేసిన వాదనకు (Brijesh Kumar Tribunal) బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గుచూపడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్‌ఎస్ పార్టీ విజయమని ఆమె అన్నారు.
Anil Ravipudi: నాకు తెలిసిన సినిమా అదే… నేను ఇలాగే చేస్తా.. హేటర్లకు అనిల్ మార్క్ కౌంటర్
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం, మొదటగా రెండు రాష్ట్రాల వాదనలు వినాలని ట్రిబ్యునల్ నిర్ణయించింది. ఫిబ్రవరి 19 నుండి 21 వరకు వాదనలు విననున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వాదనలు పూర్తయ్యాక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (Section 89) ప్రకారం తుది నిర్ణయాలపై చర్చిస్తామని తెలిపింది. అనంతరం ప్రాజెక్టుల ఆధారంగా నీటి కేటాయింపుల అంశాన్ని తేల్చనున్నట్లు ప్రకటించింది.
Chandrababu: రేపు మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ ప్రారంభించనున్న చంద్రబాబు